అధికారం ఉందని కేంద్రంలో రాష్ట్రంలో బీజేపి నేతలు ఎగిరిపడుతున్నరు.!సిరిసిల్లలో గర్జించిన కేటీఆర్.!

సిరిసిల్ల/హైదరాబాద్ : రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర బీజేపి నేతలు ప్రగల్బాలు పలుకుతున్నారని టీఆర్ఎస్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధ్వజమెత్తారు. నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల ఉసురు పోసుకుంటున్న బీజేపి నేతలు రైతుల పట్ల నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని కేంద్రంలో, రాష్ట్రంలో కాషాయ నేతలు ఎగిరెగిరి పడుతున్నారని, ప్రజలు త్వరలో బుద్ది చెప్పారని కేటీఆర్ మండిపడ్డారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వంద నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. అందులో బాగంగా సిరిసిల్లలో నిర్వహించిన దీక్షా కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని కేంద్ర బీజేపి విధానాలను తప్పుబట్టారు.

యాసంగి వడ్లు కొనేంతవరకూ బీజేపీని విడిచి పెట్టే ప్రసక్తే లేదు.. సిరిసిల్లలో గర్జించిన కేటీఆర్

యాసంగి వడ్లు కొనేంతవరకూ బీజేపీని విడిచి పెట్టే ప్రసక్తే లేదు.. సిరిసిల్లలో గర్జించిన కేటీఆర్

అంతే కాకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి సిరిసిల్ల ధర్నాల్లో కనిపిస్తోందని, ఉద్యమం నాటి జోష్ మళ్లీ వచ్చిందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు హయాంలో రైతు వ్యవసాయానికి తగిన ప్రధాన్యత లభిస్తోందని స్పష్టం చేసారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రైతు వ్యతిరేక విధానాలను ఈ ఏడున్నరేళ్ల లో తుడిచి పెట్టగలిగామని అన్నారు. తెలంగాణను సశ్యస్యామలం చేసేందకు చెరువులకు 20 వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి పల్లె జీవితాన్ని బాగు పరుచుకోగలిగామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మే రైతు బంధు, రైతు బీమా అందిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రైతు బంధు ను కేంద్రంతో సహా పదకొండు రాష్ట్రాలు కాపీ కొట్టాయని మంత్రి కేటీఆర్ గుర్తు చేసారు.

బీజేపీ నీతి మాలిన పార్టీ.. రైతులే తరిమి కొడతారన్న కేటీఆర్

బీజేపీ నీతి మాలిన పార్టీ.. రైతులే తరిమి కొడతారన్న కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆత్మహత్యలు తగ్గాయని పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. రైతును రాజు చేయాలన్నదే చంద్రశేఖర్ రావు తపన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నెరవేరిందని అన్నారు. 3 కోట్ల టన్నుల ధాన్యం తెలంగాణ రైతాంగం పడించడం దేశానికి గర్వకారణం కాదా అని కేటీఆర్ పేర్కొన్నారు. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో భారత్ స్థానం 101 గా ఉందన్న అంశం అక్టోబర్ లో విడుదలైన ఓ నివేదిక స్పష్టం చేస్తోందని, పొరుగున ఉన్న బంగ్లా దేశ్, నేపాల్, పాకిస్థాన్ ల రాంక్ లు వంద లోపే ఉన్నాయన్నారు. కాంగ్రెస్, బీజేపీ ల దిక్కు మాలిన పాలన దుస్థితికి ఈ రాంక్ అద్దం పడుతోందని గత ప్రభుత్వాలపై కేటీఆర్ దుమ్మెత్తిపోసారు.

జాతీయ పార్టీ కి జాతీయ విధానం లేదు.. బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అంటున్న కేటీఆర్

జాతీయ పార్టీ కి జాతీయ విధానం లేదు.. బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అంటున్న కేటీఆర్

అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ తొండి సంజయ్ లాగా మారారని, తన పాద యాత్రలో ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల్లో బస చేసిన సంజయ్ కి తెలంగాణ అభివృద్ది కనపడలేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారని, మోడీ ధాన్యం కొంటామంటే మేము వద్దంటున్నమా? వ్యవసాయం ఉమ్మడి జాబితాలో ఉందని, రాజ్యాంగం ప్రకారం ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఏ పంట వేయాలన్నది కేంద్రం చెప్పే అవసరం లేదని, తెలంగాణ లో ప్రాజెక్టుల ఫలితంగా ధాన్యం ఉత్పత్తి పెరగగానే కేంద్రం కొర్రీ లు పెడుతోందని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

ప్రాజెక్టు లకు జాతీయ హోదా ఇవ్వరు.. పైగా గులాబీ ప్రభుత్వాన్ని ఎలా నిందిస్తారన్న కేటీఆర్..

అంతే కాకుండా వరి పంట వేయడం తప్ప వేరేది రాదని తెలంగాణ రైతులు పట్టుబడుతున్నారని, కేంద్రం మాత్రం వరి వద్దు అంటోందని మంత్రి కేటీఆర్ గుర్తు చేసారు. ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే తెలంగాణ బీజేపీ అద్యక్షుడు సంజయ్ వరి వేయాల్సిందేనని చెప్పుకొస్తున్నాడని, సంజయ్ లాంటి పిచ్చోడిని పార్లమెంట్ కు ఎందుకు పంపారో అని సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఓట్ల కోసం బీజేపీ రాజకీయాలు చేస్తోందని, రైతుల జీవితాలతో చలి మంటలు కాచుకుంటోంది మండిపడ్డారు. మోడీ, పీయూష్ గోయల్ వరి వేయాలంటే మేము కాదంటున్నమా బండి సంజయ్ స్పష్టత ఇవ్వాని నిలదీసారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని కేంద్రమంత్రి కొడుకు కారుతో తొక్కించి ఎనిమిది మందిని చంపేశారని మంత్రి గుర్తు చేసారు. బీజేపీ డ్రామాలు ఎల్ల కాలం నడవవని, రైతు కన్నెర్ర జేస్తే ఎడ్ల బండి కింద బీజేపీ నలిగి పోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+