భయపడకండి, తెలంగాణలో పోరాడండి: చంద్రబాబు, ఇదీ జగన్
హైదరాబాద్: ప్రజల సమస్యల పైన రాజీలేని పోరాటం చేయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం సూచించారు. అక్రమ కేసులు ఎన్ని పెట్టినా భయపడాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు.
పార్టీ యంత్రాంగాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉండటం నచ్చని ఇతర పార్టీల వారు కక్ష కట్టి బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ యంత్రాంగమంతా ఐక్యంగా ఉంటూ వాటిని ఎదుర్కోవాలని సూచించారు.

తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు బాబుతో భేటీ అయ్యారు. తెలంగాణలో టీడీపీకి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాల పైన వారు చర్చించారు.
కేసీఆర్, జగన్ ఇంతకాలం రహస్య స్నేహితుల్లా వ్యవహరించారని, ఇప్పుడు వారి ముసుగు తొలగించి బాహాటంగానే కుట్రలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రైతులు, పేదల తరఫున పోరాడాలని చంద్రబాబు సూచించారు. తెరాస టీడీపీని బలహీనపరచాలని చూస్తోందని చంద్రబాబు అన్నారు.












Click it and Unblock the Notifications