• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీకర్థమవుతుందా...? ఆంధ్రాకు ఎవ్వరూ వెళ్లకండి..! సీఎం కేసీఆర్ హుకుం..! కారణం అదేనా..?

|

అమరావతి/హైదరాబాద్ : కరోనా మహమ్మారి సరిహద్దుల మీదనే కాకుండా మనుషుల మధ్య కూడా అడ్డుగోడలు నిర్మిస్తోంది. రాష్ట్రం విడిపోయిప్పటికి ఎలాంటి విభేదాలు లేకుండా సోదర భావంతో ఐకమత్యంగా ఉంటున్న ఏపి తెలంగాణ ప్రజల మధ్య కరోనా మహమ్మారి చిచ్చు పెడుతున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉండడంతో అక్కడకు వెళ్లడం వాయిదా వేసుకోవాలని, ప్రస్తుత తరుణంలో ఏపీకి వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని తెలంగాణ ప్రభుత్వ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. తెలంగాణ నుండి ఎవ్వరూ కూడా ఏపి వెళ్లే సాహసం చేయొద్దని సీఎం చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

  Telangana BJP Chief Bandi Sanjay Slams KCR Over Jobs In Telangana | Oneindia Telugu
   ఏపి తెలంగాణ సరిహద్దులు బంద్..

  ఏపి తెలంగాణ సరిహద్దులు బంద్..

  కరోనా వైరస్ సోకకుండా జాగ్రత్తపడేందుకు అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలని తెలుగు రాష్ట్రాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కరోనా వ్యాప్తి చెందే ఏ ఒక్క అవకాశాన్ని కూడా తరిమికొట్టాలని పిలుపునిస్తోంది. అందులో భాగంగా గత 37రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తున్న తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ నుండి ఏ ఒక్కరు కూడా ఏపీకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసారు తెలంగాణ సీఎం చంద్రశేకర్ రావు. తెలంగాణ తో పోల్చితే ఏపిలో కరోనా వ్యాధుల తీవ్రత ఎక్కువాడా ఉండడమే ఇందుకు కారణంగా వివరణ ఇస్తోంది టీ సర్కార్.

  ఏపిలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది..

  ఏపిలో కరోనా వేగంగా వ్యాపిస్తోంది..

  తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు సంచలన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు ఎవరూ ఏపీకి వెళ్లొద్దని తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఆంధప్రదేశ్ కి వెళ్లడంపై పూర్తి నిషేధాజ్ఞలు అమలులో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే సరైనా కారణం లేకుండా ఏపీకి వెళ్తే పోలీసు కేసులు కూడా నమోదవుతాయని తెలుస్తోంది. తెలంగాణ సరిహద్దు జిల్లాల్లోనే కరోనా ఎక్కువగా ఉండటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది . కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలు తెలంగాణ భూభాగంతో సరిహద్దును పంచుకుంటున్నాయి. ఏపీ కరోనా కేసుల్లో 60 శాతం కేసులు ఈ మూడు జిల్లాలవే. అందుకే కరోనా తెలంగాణ రాష్ట్రంలో ప్రబలకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

  ఏపికి వెళ్లడం వాయిదా వేసుకోండి..

  ఏపికి వెళ్లడం వాయిదా వేసుకోండి..

  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో తనకు అత్యంత సాన్నిహిత్యం ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పలు సందర్బాల్లో చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. అటు చంద్రశేఖర్ రావు కూడా తనకు గురువులాంటి వారని జగన్మోహన్ రెడ్డి పలు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. రాయలసీమను సస్యశ్యామలం చేస్తానన్న చంద్రశేఖర్ రావుపై ప్రశంసల వర్షం కురిపించారు జగన్. ఇరు రాష్ట్రాల మద్య ఇంతటి అన్యోన్యం చిగురించగా కరోనా చీడపీడలా దాపురించింది. ఇరు రాష్ట్రాల మద్య ప్రస్తుతం రాకపోకలను నిషేదించి తన పైశాచికత్వాన్ని చాటుకుంలోంది మాయదారి కరోనా.

  ప్రజల ప్రాణాలే ముఖ్యం..

  ప్రజల ప్రాణాలే ముఖ్యం..

  ఇక కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీ దారిలో నడుస్తుంటే చంద్రశేఖర్ రావు మాత్రం తనదైన సొంత దారిలో నడుస్తున్నారు. బెంగుళూరు హైదరాబాదు రహదారి కర్నూలు జిల్లాలోనే కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. అందుకే సరిహద్దులో కట్టుదిట్టమైన వేర్పాట్లు ఏర్పాట్లను చేశారు. హైవేల పక్కన ఉండే హోటళ్లు, దాబాలు ఇంకా తెరుచుకోలేదు. మరికొన్నాళ్లు వీటిపై నిషేధం కొనసాగే అవకాశాలు కనిపాస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాదు మినహా ఇతర జిల్లాల్లో కరోనా వ్యాప్తిని చంద్రశేఖర్ రావు బాగా నియంత్రించగలిగారు. అందులో భాగంగానే మరింత కట్టుదిట్టంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

  English summary
  Telangana government is warning the public that the travelling to Andhra Pradesh should be postponed. It seems that CM Chandrashekhar Rao has given orders not to take any adventure from ap to Telangana journey.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X