మావోల పాత్ర లేదు: సూర్యాపేట కాల్పులపై డిజిపి
నల్లగొండ: పోలీసులపైకి కాల్పులు జరిగిన సంఘటనలో మావోయిస్టుల పాత్ర లేదని తెలంగాణ డిజిపి అనురాగ్ శర్మ అన్నారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో కాల్పులు జరిగిన సంఘటనా స్థలాన్ని ఆయన గురువారం ఉదయం పరిశీలించారు. బీహార్, ఉత్తరప్రదేశ్ ముఠాలే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నాయని ఆయన అన్నారు.
నల్గొండ జిల్లాలోని సూర్యాపేట హటెక్ బస్టాండ్‌లో గత అర్థరాత్రి 12:30 గంటలకు పోలీసులపై దుండగులు కాల్పులు జరిపారని ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపారు. దుండగుల కోసం ఏపీ, తెలంగాణలో గాలింపు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
పోలీసులపై నిందితులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని, ఈ ఘటనలో ఇద్దరు లేదా ముగ్గురు పాల్గొని ఉండవచ్చన్నారు. సంఘటనా స్థలంలో ఒడిశాకు చెందిన ఐడీ కార్డు లభ్యమైనట్లు చెప్పారు. అలాగే పోలీసుల తుపాకీని దుండగులు ఎత్తుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు.

కాల్పులకు పాల్పడింది యూపీకి చెందిన మీరట్ గ్యాంగ్‌గా ఎస్పీ తెలిపారు. మీరట్ గ్యాంగ్‌లోని సభ్యుడు తన్వీర్‌పై అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. కాల్పుల ఘటనా స్థలాన్ని ఐజీ నవీన్‌చంద్, డీఐజీ గంగాధర్, ఎస్పీ ప్రభాకర్‌రావు పరిశీలించారు.
కాల్పుల్లో మరణించిన హోంగార్డు కుటుంబానికి పది లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తామని, ఇతర బెనిపిట్స్ కూడా అందేలా చూస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications