నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అపోహ‌లు అవ‌స‌రం లేదు..! నిజామాబాద్ లో పోలింగ్ ప‌ద‌కొండునే..! స్ప‌ష్టం చేసిన ఈసి..!!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికకు జరిగే పోలింగ్ తేదీలో మార్పు లేదని, ముందుగా ప్రకటించిన తేదీలోనే జరుగుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారి ఉమేష్ సిన్హా తెలిపారు. ఇప్పటికే నిజమాబాద్ లో ఈవీఎం లు పరీక్షించాం, పోలింగ్ తేదీ 11లో ఎలాంటి మార్పు లేదన్నారు. ఇప్పటివరకు అత్యధికంగా 4 బ్యాలెట్ యూనిట్లు మాత్రమే ఉపయోగించాం, 24 బ్యాలెట్ యూనిట్స్ వరకు ఉపయోగించవచ్చన్నారు.

నిజామాబాద్ ఎన్నికల ఏర్పాట్ల పై నిన్న సమావేశం అయినట్లు ఉమేష్ సిన్హా తెలిపారు. అన్ని ఏర్పాట్లు బాగా ఉన్నాయని, ప్రత్యేకంగా నిజామాబాద్ ఎన్నికల్లో ఎక్కువ 185 అభ్యర్థులు పోటీలో ఉన్న విష‌యం తెలిసిందేన‌ని ఈసీ తెలిపారు.

No need for myths..! Polling in Nizamabad is on 11th ..! EC clarified .. !!

అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉన్నా నిజామాబాద్ ఎన్నికల్లో ఈవీఎం లు,వీవీ ఫ్యాట్ లు వాడుతున్నామన్నారు. ఈవీఎంలతో ఇంత పెద్ద సంఖ్యలో అభ్యర్థులను ఎన్నికలు నిర్వహించడం చాలా గొప్ప విషయం అన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం రెండు జిల్లాలో ఉందన్నారు.

నిజామాబాద్ ఎన్నికల పై నిన్న బెల్, ఈసీఐఎల్ కంపెని ఇంజనీర్స్ తో సమావేశం అయ్యామన్నారు. ఇందుకోసం 25 వేల బ్యాలెట్ యూనిట్లు, 2 వేల కంట్రోల్ యూనిట్స్ వాడుతున్నామన్నారు. ఎన్నికలు ముగిసే వరకు ఇంజనీర్స్ అక్కడే ఉంటారని, పోలింగ్ సిబ్బంది ని కూడా పెంచామన్నారు. ప్రత్యేక పరిశీలకులు కూడా వస్తున్నారు, ఈవీఎం లు వీవీ ఫ్యాట్ లపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలకు, మీడియా, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు.

English summary
Umesh Sinha, the Central Election Commission official said, "There is no change in the date of polling to Nizamabad Parliament. EVMs have already been tested in Nizamabad and there is no change in the date of polling date 11.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X