కాంగ్రెస్ నుంచి ఎవరూ వెళ్లిపోవడం లేదు: డీఎస్, జానాలపై ఉత్తమ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని ఎవరూ వీడటం లేదని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్, జానారెడ్డిలు టిఆర్ఎస్‌లోకి వెళ్తున్నారని వస్తున్న వార్తలపై స్పందించారు.
జానారెడ్డి, డీఎస్ లాంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌ను వీడరని స్పష్టం చేశారు. అదేవిధంగా జానారెడ్డితో టిఆర్‌ఎస్ ఎంపి వినోద్ భేటీకి సంబంధించిన వివరాలు తనకు తెలియవని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అన్నారు.

ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత డి శ్రీనివాస్ కలిసిన విషయం తెలిసిందే. అంతకుముందే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలకు సరైన గౌరవం దక్కడం లేదని ఆయన వాపోయారు.
తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎప్పుడు చేరాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదని డి శ్రీనివాస్ చెప్పారు. తనపోటు ఎవరెవరు వస్తారన్నదానిపై త్వరలో వివరాలు వెల్లడిస్తానని డిఎస్ తెలిపారు.












Click it and Unblock the Notifications