వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం కేసీఆర్ సంచలనం: నియంత్రిత సాగుకు మంగళం -పంటల కొనుగోళ్లు లేవ్ -28నుంచి రైతుబంధు

|
Google Oneindia TeluguNews

వ్యవసాయ రంగానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి, భారీ ఎత్తున ప్రచారం చేయించి, కొన్నాళ్లు అమలుచేసి విఫలమైన నియంత్రిత సాగు విధానాన్ని ఎట్టకేలకు రద్దు చేసుకున్నారు. నిన్నటిదాకా కేంద్ర వ్యవసాయ చట్టాలను తూర్పారపట్టిన ఆయన.. ఇప్పుడు అవే చట్టాలను సాకుగా చూపిస్తూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను శాశ్వతంగా రద్దు చేయనున్నట్లు తెలిపారు. అయితే భారీ ఊరట కల్పిస్తూ రైతు బంధు పథకం డబ్బులను సోమవారం(డిసెంబర్ 28) నుంచే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు ప్రకటించారు.

బిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణబిగ్‌బాస్-4లో నాగార్జున దరిద్రం -భార్య, కోడలితో డేటింగ్ సరేనా? -పవన్‌కు అంతలేదు: సీపీఐ నారాయరణ

 సాగుపై సీఎం కీలక సమీక్ష

సాగుపై సీఎం కీలక సమీక్ష

రాష్ట్రంలో వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు - కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు -ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి సహా కీలక నేతలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Recommended Video

తెలంగాణలో రైతులకు గుడ్ న్యూస్: నియంత్రిత సాగు విధానం రద్దు.. పంటను ఎక్కడైన అమ్ముకోవచ్చు
నియంత్రిత సాగుకు చెల్లుచీటి..

నియంత్రిత సాగుకు చెల్లుచీటి..

ఇకపై తెలంగాణలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రైతులు ఏ సీజన్ లో ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయబోదని క్లారిటీ ఇచ్చారు. ఎప్పుడు ఏ పంటలు వేయాలో రైతులే నిర్ణయించుకోవాలని సూచించారు. మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసుకున్న రైతు వేదికల్లోనే అన్నదాతలు, అధికారులు తరచూ సమావేశమై నిర్ణయం తీసుకోవాలని, మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఏ పంట వేయాలో చర్చించుకోవాలని పేర్కొన్నారు. నియంత్రిత సాగులో భాగంగా సన్న రకం వడ్లను పండించాలన్న సీఎం పిలుపుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, ఆ పంట కొనుగోళ్ళలో గందరగోళం ఏర్పడటం తదితర పరిణామాల నేపథ్యంలో మొత్తం నియంత్రిత సాగు విధానాన్నే సర్కారు వెనక్కి తీసుకోవడం గమనార్హం. అదే సమయంలో..

 రైతు బంధు కింద రూ.7,515కోట్లు..

రైతు బంధు కింద రూ.7,515కోట్లు..

తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న రైతు బంధు పథకం కింద ఈ నెల 28వ తేదీ (సోమవారం) నుంచి వచ్చేనెల (జనవరి-2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 యాసంగి సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్ల రూపాయలు పంటసాయంగా అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంకులో జమ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు..

 ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లు ఉండవు..

ఇకపై ప్రభుత్వ కొనుగోళ్లు ఉండవు..


తెలంగాణలో వివిధ రకాల పంటల కొనుగోళ్ల వల్ల ప్రభుత్వానికి భారీ ఎత్తున నష్టం వచ్చినట్లు సమీక్ష సమావేశంలో అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని చెప్పారు. కేవలం ధాన్యం కొనుగోళ్లతోనే రూ.3,935 కోట్లు, మక్కల కొనుగోళ్లతో రూ.1,548 కోట్లు, కందులతో రూ.413 కోట్ల నష్టం వచ్చిందని వివరించారు. కరోనా దృష్ట్యా రైతులు నష్టపోకూడదనే గ్రామాల్లో పంట కొనుగోళ్లు చేపట్టామని అధికారులు వివరించారు. అందుచేత వచ్చే ఏడాది నుంచి గ్రామాల్లో ప్రభుత్వ పరంగా పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం సాధ్యపడదని అధికారులు తెలియజేశారు. ఇందుకోసం..

కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉటంకిస్తూ..

కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉటంకిస్తూ..

రైతుల నుంచి పంటలు కొనడం వల్ల తీరని నష్టం వాటిల్లిందన్న తెలంగాణ సర్కార్.. కొనుగోలు కేంద్రాల ఎత్తివేతకు వివాదాస్పద కేంద్ర వ్యవసాయ చట్టాలను ఉటంకించడం గమనార్హం.‘‘ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. రైస్ మిల్లరో, దాల్ మిల్లరో కాదు. కొనుగోళ్లు - అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు. కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. అయితే, వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్ కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలి'' అని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణకు భారంగా రైతు బీమా

తెలంగాణకు భారంగా రైతు బీమా

‘‘రాష్ట్రంలో వ్యవసాయం బాగా విస్తరిస్తున్నది. వ్యవసాయశాఖ అనేక పనులు నిర్వహించాల్సి వస్తున్నది. వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ప్రతిఏటా రెండుసార్లు రైతుబంధు పంటసాయం అందించే పనులను వ్యవసాయ అధికారులు చూడాలి. రైతు బీమాను పకడ్బందీగా అమలు చేయాలి. రైతు బీమా కార్యక్రమం ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. కానీ, చాలామంది రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని కుటుంబ సభ్యుల పేర రిజిస్టర్ చేయించారు. దీంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి. సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేట్లు చూడాలి. కల్తీలను, నకిలీలను గుర్తించి అరికట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి'' అని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది.

బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్బీజేపీ ఎత్తులకు సీఎం నితీశ్ చెక్ -జేడీయూ కొత్త అధ్యక్షుడిగా ఆర్‌సీపీ సింగ్‌ -భంగపడ్డ ప్రశాంత్ కిషోర్

English summary
telangana Chief Minister kcr took back regulated farming policy and no govt purchase centres from next year onwords. financial assistance for all farmers under Rythu Bandhu Scheme from Monday (Dec 28) to January 2021.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X