వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉస్మానియా వర్సిటీలో నాన్ బోర్డర్స్‌కు షాక్: 4రోజులే టైమ్!

నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్శిటీ హాస్టళ్లలో ఉండాలన్న నిబంధన యూనివర్సిటీ ఆరంభం నుంచ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వర్సిటీలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే యూనివర్శిటీ హాస్టళ్లలో ఉండాలన్న నిబంధన యూనివర్సిటీ ఆరంభం నుంచి ఉంది. అయితే, ఆ నిబంధనను ఇప్పుడు అమలు చేస్తుండటమే ఇందుకు కారణం.

ఆందోళనలు వారివల్లే..

ఆందోళనలు వారివల్లే..

ఇంతకుముందు మాత్రం ఈ నిబంధన అమలులో లేదని సిబ్బంది పలు సందర్భాల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో భారీ ఎత్తున నాన్ బోర్డర్స్ ఉస్మానియాలో తిష్టవేశారని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. వర్సిటీలో జరిగే ఆందోళనల్లో వారే ఎక్కువగా పాల్గొంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

Recommended Video

Students bid to barge into C-Block in Secretariat
ఈ క్రమంలోనే..

ఈ క్రమంలోనే..

ఈ నేపథ్యంలోనే ఉస్మానియాలో నాన్ బోర్డర్స్ విషయంలో ఉదాసీనత పనికిరాదనే నిర్ణయానికి పాలక కమిటీ వచ్చింది. దీంతో తక్షణం నాన్ బోర్డర్స్‌ని ఖాళీ చేయించేందుకు చర్యలు చేపట్టింది. కేవలం నాలుగంటే నాలుగే రోజుల్లో యూనివర్సిటీలోని అన్ని హాస్టళ్ల నుంచి నాన్‌ బోర్డర్స్ ను ఖాళీ చేయించాలని, వార్డెన్లు తనిఖీలు నిర్వహించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

కఠిన చర్యలే..

కఠిన చర్యలే..

మొండికేసిన వారిని ఖాళీ చేయించేందుకు అవసరమైతే యూనివర్సిటీ హాస్టళ్లకు విద్యుత్‌, నీటి సరఫరా నిలిపేయాలని సూచించింది. అప్పటికీ నాన్ బోర్డర్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సహకారం తీసుకుంటామని స్పష్టం చేసింది.

ఉద్యోగార్థులకు షాకే..

ఉద్యోగార్థులకు షాకే..

అయితే, పలు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు స్నేహితుల సహకారంతో యూనివర్సిటీల్లో ఉంటారు. లైబ్రరీ సౌకర్యం అందుబాటులో ఉండటంతో ఉద్యోగార్థులకు ఉస్మానియా యూనివర్సిటీలోనే పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంటారు. ఈ కారణంగానే పలువురు విద్యార్థులు ఉస్మానియాలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. తాజా నిబంధనతో వారు కూడా వర్సిటీ వదిలివెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
The Osmania University on Tuesday asked the 'non-boarders' to immediately move out of the hostels voluntarily and threatened that it was planning on seeking police help to evacuate them. The varsity officials also warned students that they would not intervene in case of police raids.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X