వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాంతేతర పార్టీలకు కేసీఆర్ వల్లే బెనిఫిట్; ఏపీలో, దేశంలోనూ బీఆర్ఎస్ అనవసర ప్రయోగం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలన పైన, కెసిఆర్ తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలపైన, జాతీయ రాజకీయాలను చేస్తానని చెప్పిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పైన బిజెపి నాయకురాలు విజయశాంతి తనదైన శైలిలో ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం కేసీఆర్ విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు.

తెలంగాణేతర పార్టీల రాజకీయ ప్రయోజనాలకు కెసిఆర్ వల్లే సానుకూలత

తెలంగాణేతర పార్టీల రాజకీయ ప్రయోజనాలకు కెసిఆర్ వల్లే సానుకూలత

సోషల్ మీడియా వేదికగా నిత్యం విరుచుకుపడుతున్న విజయశాంతి తాజాగా బి ఆర్ ఎస్ జాతీయ రాజకీయాలు, కెసిఆర్ పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ సీఎం కేసీఆర్ బి ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటుతో ఆయనకే తీరని నష్టం జరుగుతుందని బిజెపి నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటుతో తెలంగాణాలో తెలంగాణేతర పార్టీల రాజకీయ ప్రయోజనాలకు కెసిఆర్ సానుకూలతను సృష్టిస్తున్నారని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కేసీఆర్ బీఆర్ఎస్ అనవసరపు ప్రయత్నం అని ఆయనకే తెలుసు

కేసీఆర్ బీఆర్ఎస్ అనవసరపు ప్రయత్నం అని ఆయనకే తెలుసు


గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మంలో సభ నిర్వహించడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో అనేక కొత్త పార్టీలు ఫోకస్ చేయడం పై ఆసక్తికర పోస్ట్ పెట్టిన విజయశాంతి తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల రాజకీయ ప్రయోజనాలకు సానుకూలతను కేసీఆర్ ఎందుకు సృష్టిస్తున్నారు అనే ప్రశ్నకు ఆయనే సమాధానం చెప్పి తీరాలన్నారు. కెసిఆర్ గారి బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లోని మిగతా దేశంలోనూ అనవసర ప్రయత్న అవుతుంది అనేది అందరికన్నా వారికే ఎక్కువ తెలుసని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్ర పార్టీలపై మాట్లాడలేని పరిస్థితి తెచ్చుకున్న కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్ర పార్టీలపై మాట్లాడలేని పరిస్థితి తెచ్చుకున్న కేసీఆర్

బి ఆర్ ఎస్ ప్రయోగంతో కెసిఆర్ తెలంగాణకు నష్టం చేస్తున్నారని విజయశాంతి పేర్కొన్నారు. ప్రస్తుత పరిణామాల పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇన్ని దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి సమాధానం చెప్పి తీరాలన్నారు. పక్క రాష్ట్రాలలో స్వార్థంతో కేసీఆర్ చేపట్టిన బీఆరెస్ పార్టీ వ్యవహారాల వల్ల... తెలంగాణ రాష్ట్రంలో వేరే రాష్ట్ర పార్టీలపై మాట్లాడలేని పరిస్థితి ఆయన తెచ్చుకున్నారని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ, తెలంగాణ సమాజం ఆ అవసరంలో లేదని పేర్కొన్న విజయశాంతి నిజమేంటో.. తీర్పు ఏంటో మన ప్రజలకు తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణా ప్రజలలో క్లారిటీ ఉంది

కేసీఆర్ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణా ప్రజలలో క్లారిటీ ఉంది

ఎవరెన్ని చేసినా తెలంగాణ రాష్ట్ర సమగ్రత, ఆత్మాభిమానపూరిత తెలంగాణ గౌరవాన్ని ఎప్పటికీ ఈ ప్రజలు కాపాడుకుని తీరుతారనేది సత్యమైన... కాల పరీక్షలో నిరూపితమైన ప్రజల మనోభావం, చరిత్ర చెప్పిన వాస్తవం అని విజయశాంతి పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కెసిఆర్ తెలంగాణ రాష్ట్రంలో కి వస్తున్నా, ప్రాంతీయ పార్టీలను ప్రశ్నించ లేకపోయినా, తెలంగాణ ప్రజలు మాత్రం తెలంగాణ గౌరవాన్ని ఎప్పటికీ కాపాడుకునేలా నడుచుకుంటారు అంటే విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతేతర పార్టీలను ప్రశ్నించ లేకుండా సీఎం కేసీఆర్ బి ఆర్ ఎస్ పేరుతో కొత్త సమస్యను సృష్టించుకున్నారు అని విజయశాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రాంతేతర పార్టీలు తెలంగాణాలో పనిచెయ్యటమే కేసీఆర్ కు కావాలి; ఎందుకంటే!!ప్రాంతేతర పార్టీలు తెలంగాణాలో పనిచెయ్యటమే కేసీఆర్ కు కావాలి; ఎందుకంటే!!

English summary
Vijayashanthi expressed the opinion that non-regional parties will benefit from KCR and that BRS is an unnecessary experiment in AP and in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X