2021లో టాలీవుడ్‌కు తొలి విషాదం -సినీ రచయిత వెన్నెలకంటి ఇకలేరు

కొత్త ఏడాదిలోనూ సినీ రంగాన్ని విషాదం వెంటాడుతోంది. ప్రముఖ సినీ రచయిత వెన్నెలకంటి(63) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్రమైన గుండెపోటు రావడంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతిపట్ల దేశప్రముఖులు, సినీ, రాజకీయ వర్గాలు తీవ్ర సంతాపం తెలిపాయి.

మరోవైపు వెన్నెలకంటి మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం తెలియజేశారు. వెన్నెలకంటి మంచి గీత రచయితే గాక, గొప్ప సాహితీవేత్త అని కొనియాడారు. వారు రాసిన గీతాల్లో శ్రీ రంగరంగనాథుని దివ్య రూపమే చూడవే అనే గీతం తనకెంతో ఇష్టమైనదని తెలిపారు. ఆయన కుమారుడు తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారని తెలియజేసి వెన్నెలకంటి తన దగ్గర ఆనందం వ్యక్తం చేశారని, ఇంతలోనే ఇలా జరగడం విచారకరమని తెలిపారు.

 Noted Telugu Lyricist, Dialogue Writer Vennelakanti Passes Away

ఆయనకు ఇద్దరు తనయులు. ఒకరు శశాంక్ వెన్నెలకంటి. అతను కూడా సినీ రచయిత. రెండవ తనయుడు రాకెందు మౌళి. కాగా డబ్బింగ్ స్క్రిప్ట్ రైటర్‌గా వెన్నెలకంటికి మంచి పేరు ఉంది. తమిళ సినిమాలకు కూడా లిరిక్స్ అందించారు.

1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించారు. వెన్నెలకంటి పూర్తి పేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. హరి కథలు, ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడాన్ని ఆయన బాగా ఇష్ట పడేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు. 1986లో భాస్కర్ రావు డైరెక్షన్‌లో వచ్చిన శ్రీరామ చంద్రుడు సినిమాతో గీత రచయితగా వెన్నెలకంటి ప్రస్థానం మొదలైంది. వెన్నెలకంటి తండ్రి 'ప్రతిభా' కోటేశ్వరరావుకూ సినీ అనుబంధం ఉంది. ఎస్పీబీ ప్రోత్సాహంతో సినీ రంగంలోకి అడుగు పెట్టారు.

జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో వెన్నెలకంటి నటించారు. హాలీవుడ్ చిత్రాల తెలుగు డబ్బింగ్ వెన్నెలకంటితోనే ఆరంభం అయ్యాయి. 34 ఏళ్లలో 1500కు పైగా స్ట్రెయిట్‌ పాటలు రాసిన వెన్నెలకంటి.. డబ్బింగ్ చిత్రాల్లో మరో 1500కు పైగా పాటలు రచించారు. బ్యాంకు ఉద్యోగిగాను ఆయన పని చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+