పట్టివేత: లగ్జరీ లైఫ్‌కు అలవాటు, చోరీలు (పిక్చర్స్)

హైదరాబాద్: లగ్జరీ జీవితానికి అలవాటు పడి ఇళ్లలో చోరీలు చేస్తున్న ఓ యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని చిత్తూరులు జిల్లాకు చెందిన అవిలినేని మదన్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. 22 ఏళ్ల మదన్ కుమార్ చిత్తూరు జిల్లా నుంచి హైదరాబాద్‌లోని గండిపేటలో గల ఓ ఇంజనీరింగ్ కళశాలలో చేరాడు. అయితే చదువుకు మధ్యలోనే స్వస్తి చెప్పి చోరీలనే వృత్తిగా ఎంచుకున్నాడు.

అతనితో పాటు మరో ఇద్దరిని హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీసులు సిసిఎస్ సెంట్రల్ జోన్ పోలీసులతో కలిసి అరెస్టు చేసారు. వారి నుంచి ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్ జోన్ డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వర్లు వివరాలను అందించారు.

2011 నుంటి దొంగతనాలు చేస్తూ వాటిని అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులతో లగ్జరీగా తిరుగుతూ అమ్మాయిలకు ఖర్చు పెడుతూ వస్తున్నాడు. ఇంజనీరింగ్ రెండో సంవత్సరంలో ఉండగా ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. విచ్చలవిడి ఖర్చులు పెరిగిపోవడంతో ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ వచ్చాడు.

మీడియా ముందుకు..

మీడియా ముందుకు..

హైదరాబాదులోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న మదన్ కుమార్ అనే యువకుడిని అరెస్టు చేసిన విషయాన్ని వెస్ట్ జోన్ డిప్యూటీ పోలీసు కమిషనర్ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

దొంగ పట్టివేత

దొంగ పట్టివేత

చిత్తురూ జిల్లాకు చెందిన 22 ఏళ్ల అవిలినేని మదన్ కుమార్ పగటి పూట తాళాలు పగులగొట్టి ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేస్తూ వస్తున్నాడు.

ఇద్దరు రిసీవర్ల అరెస్టు

ఇద్దరు రిసీవర్ల అరెస్టు

మదన్‌తో పాటు ఇద్దరు రీసివర్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఒకరిని హైదరాబాదులోని రహ్మత్ నగర్‌కు చెందిన వి చిదానంద చారిగా, మరొకరిని హైదరాబాదులోని బ్యాంక్ స్ట్రీట్‌లో ఎలక్ట్రానికి బిజినెస్ చేస్తున్న మీర్జా అబ్దులా బేగ్‌గా గుర్తించారు. శ్రీనివాస్ అనే నిందితుడు పరారీలో ఉన్నట్లు చెప్పారు.

గతంలో అరెస్టు

గతంలో అరెస్టు

మదన్ కుమార్‌ను పోలీసులు 2012 ఫిబ్రవరిలో హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి అతను 2012 ఏప్రిల్ మొదటివారంలో విడుదలయ్యాడు.

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి..

ప్రేమించిన అమ్మాయితో పెళ్లి..

తాను ప్రేమించిన అమ్మాయిని అతను 2012 ఏప్రిల్ 27వ తేదీన పెళ్లి చేసుకుని పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+