మోడీ నోట్ల రద్దు: కేసీఆర్‌కూ డబ్బు కష్టాలు, ఇలా.. స్వయంగా చెప్పిన సీఎం
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రభావం సామాన్యుల పైనే కాదు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా పడింది.
హైదరాబాద్: నోట్ల రద్దు ప్రభావం సామాన్యుల పైన బాగా పడుతోంది. ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. క్యూలు కట్టినా తన వరకు వచ్చే వరకు డబ్బులు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి. నోట్ల రద్దు తర్వాత చేతిలో డబ్బులు లేక అందరూ ఇబ్బంది పడుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నోట్ల రద్దు ప్రభావం సామాన్యుల పైనే కాదు.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కూడా పడింది. ఈ విషయాన్ని కేసీఆరే స్వయంగా చెప్పారు. తన మనుమడు హిమాన్షుకు 'చిల్లర' డబ్బులు ఇచ్చేందుకు కూడా తన వద్ద లేవని చెబుతున్నారు.

నోట్ల రద్దు ప్రకటన అనంతరం తాను తన అకౌంట్ ఉన్న బ్యాంకు అధికారులను తన డబ్బు గురించి అడిగానని చెప్పారు. తన అకౌంటులో నాలుగైదు లక్షల రూపాయలు ఉన్నాయన్నారు. అయితే తాను కేవలం రూ.24వేలు మాత్రమే తీసుకోగలనని అధికారులు చెప్పారన్నారు.
నోట్ల రద్దు కారణంగా తాను తన మనుమడు హిమాన్షుకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నానని చెప్పారు. ఇదివరకు తాను తన వద్ద ఉన్న చిల్లర డబ్బులను తన మనుమడికి ఇచ్చేవాడినని, ఇప్పుడు ఇవ్వలేకపోతున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications