వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నారైలకు శుభవార్త: భారత్‌లో అన్ని రకాల సేవలను ఇలా పొందవచ్చు

యాడ్‌నిగమ్ వ్యవస్థాపకులు రాజిరెడ్డి కేశిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్నారైహిత (nrihita.com) వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యాడ్‌నిగమ్ వ్యవస్థాపకులు రాజిరెడ్డి కేశిరెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్నారైహిత (nrihita.com) వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.

ఎన్నారైలకు, భారత దేశంలో ఉన్న ఎన్నారై కుటుంబ సభ్యులు బంధువులకు 'ఎన్నారైహిత' ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా ఎన్నారైలకు అన్ని రకాల సేవలు లభిస్తాయి.

ఇలాంటి సేవలకు ఈ వెబ్‌సైట్ ఉపయోగం

ఇలాంటి సేవలకు ఈ వెబ్‌సైట్ ఉపయోగం

ఉదాహరణకు ప్రాపర్టీ మేనేజ్‌మెంట్, అసెట్ మోనిటరింగ్ (ఆస్తి పర్యవేక్షణ), డాక్యుమెంటేషన్ సేవలు, లీగల్ అడ్వయిజెస్ (న్యాయ సలహాలు), కంపెనీల రిజిస్ట్రేషన్లు, హోమ్ హెల్త్‌కేర్ సేవలు, ట్రావెల్ అండ్ టూర్ గైడ్, వీసా, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్ అప్లికేషన్‌లలో సహాయం, వినియోగ మరియు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుల్లో సహాయం, పార్సిల్స్, కొరియర్ సేవలు వంటివి ఈ ఎన్నారైహిత ద్వారా పొందవచ్చును.

మార్కెట్‌ను అందిపుచ్చుకుని

మార్కెట్‌ను అందిపుచ్చుకుని

భారత దేశంలో తమకు ఏదైనా అవసరమైతే ఎన్నారైలు ఇక్కడ ఉన్న తమ కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రుల పైన ఆధారపడుతున్నారు. కానీ అందరికీ అన్ని వేళల్లో ఈ సాయం అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ మార్కెట్‌ను వీరు గుర్తించారు.

అన్ని సేవలు ఒకే గొడుకు కిందకు

అన్ని సేవలు ఒకే గొడుకు కిందకు

ఈ అంతరాన్ని www.nrihita.com పూరిస్తుందని, దీని ద్వారా ఎన్నారైలకు అన్ని సేవలను ఒకే గొడుకు కిందకు తీసుకు వస్తున్నామని, ఎన్నారైలకు ఏ సాయం అవసరమొచ్చినా దీనిపై ఆధారపడవచ్చునని ఎన్నారైహిత చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజిరెడ్డి కేశిరెడ్డి చెప్పారు. ఎన్నారైలు గత ఏడాది 63 బిలియన్ డాలర్లను భారత్‌కు పంపించారని, ఇది క్రమంగా పెరుగుతోందని ఆయన చెప్పారు.

ఎన్నారై హిత అంటే

ఎన్నారై హిత అంటే

ఇంగ్లీష్ పదం ఎన్నారై, సంస్కృత పదం హిత కలయికే 'ఎన్నారైహిత' (NRIHITA). ఎన్నారైలకు సన్నిహితుడిలా మంచి సేవలు (హిత) అందిస్తామని, అందుకే ఈ వెబ్‌సైట్‌కు ఎన్నారైహిత అని పేరు పెట్టినట్లు చెప్పారు.

ఏపీ, తెలంగాణ ముఖ్య పట్టణాలలో

ఏపీ, తెలంగాణ ముఖ్య పట్టణాలలో

ఎన్నారైహిత తొలుత హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ముఖ్య పట్టణాలలో తన సేవలను అందించనుందని రాజిరెడ్డి కేశిరెడ్డి వెల్లడించారు.

190 దేశాల్లో భారతీయులు

190 దేశాల్లో భారతీయులు

అన్ని రంగాలలో కలిపి భారత్ దేశానికి చెందిన 16 మిలియన్ల వర్కింగ్ కమ్యూనిటీ 190 దేశాల్లో ఉంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారు ఇరవై లక్షల మంది వరకు ఉన్నారు. ఇందులో ఎక్కువగా అమెరికాలో ఉన్నారు. వీరు ఏటా ఏడు బిలియన్ డాలర్లు భారత్‌కు పంపిస్తున్నారు.

 పేపాల్ ద్వారా చెల్లింపులు

పేపాల్ ద్వారా చెల్లింపులు

సేవలను ఉపయోగించుకునేందుకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. 'పేపాల్' ద్వారా ఆన్ లైన్ చెల్లింపులు చేయవచ్చు. ముందస్తు చెల్లింపులతో పేర్కొన్న అన్ని సేవలను పొందవచ్చు. ఒక్కో సేవకు సర్వీస్ ఛార్జీలు కనీసం పది డాలర్ల ($10) నుంచి ప్రారంభం.

English summary
The founder of www.adnigam.com, Raji Reddy Kesireddy, on Friday launched a new startup nrihita.com in Hyderabad. The portal nrihita.com is an exclusive all-in-one services platform for NRIs (Non-Resident of India) and their dependents in India. Through this website, the startup is going to provide unique services like - property management, asset monitoring, documentation services, legal advice, firm and company registration, tax filing assistance, old age parents/dependent care taking, home healthcare service, travel and tour guide, visa/passport/pan card application assistance, school/college fee payments, utility and property tax payment assistance, parcels and courier service to NRIs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X