ఎన్ఆర్ఐలను చితకబాదిన పోలీసులు: నలుగురిపై వేటు, 12మందిపై కేసులు
హైదరాబాద్: ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ)పై దాడి కేసులో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. సోమవారం ముషీరాబాద్ పోలీసులు ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలను చితకబాదారు.
సోమవారం ఎన్‌ఆర్‌ఐలు ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేసి.. అందులో ఉన్న వారిని బయటకు లాగి మరీ పోలీసులు దాడికి దిగారు. పైగా ఎన్‌ఆర్‌ఐలే తాగి, తమపై దాడి చేశారని కేసు నమోదు చేశారు.
పోలీసుల దౌర్జన్యంపై ఎన్‌ఆర్‌ఐలు హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్చార్సీ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉన్నతాధికారులు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై డిసిపి కమలాసన్ రెడ్డి సమీక్షించారు. కాగా ఇప్పటికే 12మంది పోలీసులపై కేసు నమోదైంది. ఇద్దరు ఎస్ఐలు, 10మంది కానిస్టేబుళ్లపై కేసులు నమోదయ్యాయి.
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
ఆదిలాబాద్: జిల్లాలోని ఆసిఫాబాద్ డివిజన్‌లోని పలు మండలాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. కాగజ్‌నగర్ మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అలీగూడలో పిడుగుపాటుకు గురై ముగ్గురు మృతిచెందారు.












Click it and Unblock the Notifications