అమెరికాలో శ్రీనివాస్ కూచిభొట్లకు నివాళ్లు: పీస్ మార్చ్‌లో ఆలోక్
శ్రీనివాస్ కూచిభొట్లకు వందలాది మంది అమెరికాలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు పీస్ మార్చ్ నిర్వహించారు.
హ్యూస్టన్: అమెరికాలోని కాన్సస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో బుధవారంనాడు మరణించిన శ్రీనివాస్ కూచిభొట్లకు వందలాదిమంది ప్రజలు అమెరికాలో నివాళులు అర్పించారు. కాన్సాస్ నగరంలో 'శాంతి, ఐకమత్యం' పేరుతో పీస్ మార్చ్ నిర్వహించారు. ప్లకార్డులు, బ్యానర్లు చేతుల్లో ధరించి మార్చ్‌లో పాల్గొన్నారు.
'వియ్ వాంట్ పీస్', 'వియ్ లవ్ పీస్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కొవ్వొత్తులు చేతుల్లో ధరించి ముందుకు సాగారు. రాజకీయ జాత్యహంకారానికి మేం మద్దతు ఇవ్వబోమంటూ నినాదాలు చేశారు. కాల్పుల ఘటన నుంచి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న శ్రీనివాస్ స్నేహితుడు అలోక్ మాదసానితోపాటు కాన్సస్ లెఫ్టినెంట్ గవర్నర్ జెఫ్ కోలియర్, యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు కెవిన్ యోడెర్, ఒలాథె మేయర్ మైక్ కోప్‌ల్యాండ్, ఓల్‌థే పోలీస్ చీఫ్ స్టీవెన్ మెంకె, ఇతర అధికారులు ఈ ప్రేయర్ మీట్‌కు హాజరయ్యారు.

కన్సాస్‌లోని హిందూ ఆలయం, కల్చరల్ సెంటర్‌లో వివిధ మతాలకు చెందిన వారు ప్రార్థనలు నిర్వహించారు. హిందూ, క్రిస్టియన్, జెవిష్, ముస్లిం, సిక్కు ప్రార్థనలతో మొదలై జాన్ లెనాన్ 'ఇమాజిన్' పాటతో ప్రార్థనలు ముగిశాయి.
శ్రీనివాస్ కూచిభొట్ల మృతదేహం అమెరికా నుంచి హైదరాబాదుకు వస్తున్న విషయం తెలిసిందే. శ్రీనివాస్ కూచిభొట్ల మృతి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి












Click it and Unblock the Notifications