ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘన నివాళులు అర్పించిన బాలకృష్ణ; జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్!!

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి. శకపురుషుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నేడు ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న కుమారుడు సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

నందమూరి రామకృష్ణ, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు కూడా ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు. ఈ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రికి నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడిన నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ సినిమాలలోనే కాదు, రాజకీయాల్లోనూ అగ్రగామిగా నిలిచారని బాలకృష్ణ తెలిపారు.

 NTR centenary

ఆయన కుమారుడుగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్న బాలకృష్ణ రాజకీయాలలో ఎన్టీఆర్ తీసుకువచ్చిన సంస్కరణలను వివరించారు.తెలుగు వారి రుణం తీర్చుకోవడానికి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం నేడు ఆహార భద్రత గా మారిందని పేర్కొన్నారు.

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడం తదితర చారిత్రాత్మకమైన నిర్ణయాలను ఎన్టీఆర్ తీసుకున్నారని బాలకృష్ణ గుర్తు చేశారు. ఎన్టీఆర్ జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక పోషించారు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి, కాసేపు మౌనం పాటించి ఆయనకు నివాళులు అర్పించారు.

 NTR centenary

ఈరోజు ఉదయం ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించిన ఆయన తన తాత కు ఘనంగా నివాళులు అర్పించి ఆ మహనీయుని స్మరించుకొని ఎమోషనల్ అయ్యారు. ఆయన మనవడిగా జన్మించడం తన అదృష్టంగా భావిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు నివాళులు అర్పించటం కోసం వస్తున్నక్రమంలో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు క్రిక్కిరిసిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+