దిశ పేరుపై అభ్యంతరాలు : మా పిల్లల పేర్లు అవే: ఇప్పుడు నిర్ణయం ఏంటి..!
తెలుగు రాష్ట్రాలతో పాటుగా..దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శంషాబాద్ వెటర్నరీ డాక్టర్ అత్యాచారం..హత్య విషయంలో మరో అంశం వివాదాస్పదంగా మారింది. ఘటన జరిగిన తరువాత రెండు..మూడు రోజుల పాటుగా బాధితురాలి పేరుతోనే జరిగిన ఘటన పైన ప్రచారం సాగింది. అయితే, నిందితులను అరెస్ట్ చేయటం..రిమాండ్ కు పంపిన తరువాత పోలీసులు అసుల పేరు బయటకు వెల్లడించకూడదనే కారణంతో జస్టిస్ ఫర్ దిశా అనే పేరు వినియోగించాలని సూచించారు. దీంతో..ఇక దిశ పేరుతోనే ఆ కేసుకు సంబంధించిన చర్చ..నిరసనలు సాగుతున్నాయి.
పార్లమెంట్ లో సైతం అదే పేరుతో రెండు సభల్లోనే చర్చ జరిగింది. రాజ్యసభలో తెలంగాణకు చెందిన ఒక మంత్రి బాధితురాలి పేరు ప్రస్తావించగానే..ఛైర్ లో ఉన్న ఛైర్మన్ వెంకయ్యనాయుడు వెంటనే మందలించారు. పేరు ప్రస్తావించకూడదని సూచించారు. ఆయన ప్రయోగించిన పేరును రికార్డుల నుండి తొలిగిస్తున్నట్లు రూలింగ్ ఇచ్చారు.
మా పిల్లల పేర్లు అదే..
ఇక..సైబరాబాద్ పోలీసులు ఈ కేసు విచారణ..బాధితురాలి తరపున చేసే నిరసనలకు జస్టిస్ ఫర్ దిశ పేరుతో వ్యవహరించాలని స్పష్టం చేసారు. అయితే ఇదే సమయంలో దిశ పేరు పైనా అభ్యతరాలు వ్యక్తం అవుతున్నాయి. బాధితురాలి పేరు..వివరాలతో సహా దాదాపు రెండు రోజుల పాటు ప్రచారం సాగిన తరువాత ఇప్పుడు పేరు మార్పు పైన నిర్ణయం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే అటువంటి జాగ్రత్తలు తీసుకోలేదనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కొంపల్లికి చెందిన కవి పీవీ మూర్తిరాజు దీని పైనే ఓపెన్ గానే తన అభిప్రాయం వ్యక్తం చేసారు. తన మనవరాలి పేరు దిశ అని..ఈ పేరున్న వారు చాలా మంది ఉంటారని చెప్పుకొచ్చారు.

ఇప్పుడు పోలీసుల నిర్ణయం ఆ పేరుతో ఉన్న వారికి ఇబ్బంది కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల పేర్లు కూడా దిశ అని..మరి కొందరు పోలీసులకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలి పైన పశువుల్లా ప్రవర్తించిన ఆ నలుగురికి కఠిన శిక్ష పడాల్సిందేనని..ఆ కుటుంబానికి అందరూ అండగా నిలవాలని కోరుతనూ పేరు విషయంలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్ గా వాడే పేర్లు కాకుండా..గతలో ఢిల్లీలో జరిగిన ఒక అఘాయిత్యం తరువాత ఆ వ్యవహారం మొత్తాన్ని నిర్భయ పేరుతో వ్యవహరించిన తీరును వారు గుర్తు చేస్తున్నారు.
పోలీసుల కస్టడీకి నిందితులు
ఘటన జరిగిన మరుసటి రోజునే నలుగురు నిందుతులను అరెస్ట్ చేసిన పోలీసులు..తాము పూర్తి స్థాయిలో విచారణ చేయలేదని..తమకు విచారణ చేయటానికి తమకు అప్పగించాలని పోలీసులు కోర్టును కోరారు. దీనికి కోర్టు సైతం సమ్మతించి వారిని పోలీసు కస్టడీకి అప్పగించేందుకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
పోలీసులు వీరిని స్టేషన్ లో విచారించే సమయంలో బయట వేలాది మంది వీరికి వ్యతిరేకంగా ఆందోళన చేయటంతో..తమకు కావాల్సిన మరింత సమాచారం సేకరించలేకోపోయామని పోలీసులు కోర్టుకు నివేదించారు. దీంతో..ఇప్పుడు కోర్టు పోలీసుల పిటీషన్ పైన సానుకూలంగా స్పందించటంతో వారి నుండి మరింత సమాచారం సేకరించేందుకు పోలీసులు ప్రయత్నించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications