ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అలర్ట్ - అలా చేస్తే ఇళ్లు రద్దు..!!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు కీలక అప్డేట్. ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు.. ఆమోదంలో సాంకేతికతను వినియోగిస్తోంది. దీంతో.. అక్రమాలకు చెక్ పడినా.. తాజా నిబంధనలు మాత్రం సమస్యగా మారుతున్నాయి. పాత ఇళ్లకే బిల్లులు పొందాలనే తాజా షరతు లబ్దిదారులకు సమస్య గా మారుతోంది. అనేక కారణాలతో లబ్దిదారులకు నోటీసులు జారీ అవుతున్నాయి. దీంతో చాలా మంది ఇళ్లను రద్దు చేసుకుంటున్నట్లు గుర్తిస్తున్నారు.
ఈ సంవత్సరం జనవరిలో తొలి, మే నెలలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. 11 నెలలుగా లబ్ధిదారుల ఇళ్లకు అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. పలు కారణాలతో నిర్మించుకోవడానికి దాటవేస్తూ వస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తేనే బిల్లులు వస్తాయని భావించిన కొందరు లబ్ధిదారులు రద్దు చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఇచ్చిన 45 రోజుల్లోపు పనులు మొదలుపెట్టాలి. నెలలు గడుస్తున్నా ముందుకురాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో.. పలువురు లబ్దిదారులు రద్దు చేసుకుంటున్నారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఇప్పుడు పట్టణాల్లో లబ్ధిదారులను గుర్తిస్తున్నారు. ఎన్నికల కోడ్ ముగియడం తో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల ప్రగతిలో వేగం పెంచుతున్నారు.

పలువురు లబ్దిదారులు గతంలో మాదిరి పాత ఇల్లు, రేకుల షెడ్డుకు బిల్లు పొందాలని ఆలోచన చేస్తున్నారు. ఒక ఇంటిలో 4 గదులు ఉంటే ఏదో ఒక గది పేరిట బిల్లు తీసుకోవాలని అనుకుంటు న్నట్లు తెలుస్తోంది. ప్రతీ ఇంటికి జియో ట్యాగింగ్ అనుసంధానించి ఫొటో చిత్రీకరించడంతో పాత ఇళ్లకు బిల్లు పొందడానికి వీలు కావడం లేదు. ముగ్గు పోసిన నుంచి పూర్తైయ్యే వరకు సాంకేతికత ఉపయోగించడంతో ఇళ్లు కట్టుకోవడానికి వెనకాడుతున్నారు. ఇళ్లపై ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్లను ప్రభుత్వం సెప్టెంబర్ నెల 11న మొదలుపెట్టింది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఏమైనా సమస్యలు ఉంటే ఆదివారం మినహా మిగతా రోజుల్లో 18005995991 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని సూచించింది. బిల్లులు పెండింగ్, అధికారుల అక్రమాలపైనే అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. సాంకేతిక కారణాలతోనూ బిల్లులు నిలిచిపోతున్నాయి. దీంతో, పరిష్కారం కోసం లబ్దిదారులు ప్రభుత్వం వైపు చూస్తున్నారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications