కొరడా: ఫలాల పక్వానికి రసాయనాలు (పిక్చర్స్)
హైదరాబాద్: హైకోర్టు అదేశాల మేరకు మొజంజాహి పండ్ల మార్కెట్, గోడౌన్, దారుషిఫా మార్కెట్‌లను హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ సురేంద్ర మోహన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజే మార్కెట్‌లోని గోల్డొన్ ఫ్రూట్ సెంటర్, ప్యారడౌజ్ ఫ్రూట్ సెంటర్లను సందర్శించి ఆపిల్, దానిమ్మ, బత్తాయి, సపోట పండ్ల శాంపిల్స్‌ను సేకరించారు.
ముఖ్యంగా గోడౌన్లలో కార్బైడ్ రసాయనాన్ని వినియోగించి ఫలాలను మగ్గ బెడుతున్నారని గుర్తించి సేకరించిన పండ్లను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం పండ్లను ల్యాబ్‌కు పంపడం జరిగిందని, ల్యాబ్‌లో వచ్చే రిపోర్టు ఆధారంగా తదుపరి చర్యలుంటాయని ఇన్‌చార్జి కలెక్టర్ తెలిపారు.
రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్‌సైనీ గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మార్కెటింగ్, రెవెన్యూ, హర్టికల్చర్ విభాగం, పోలీస్ విభాగం ఫుడ్ ఇన్స్‌స్పెక్టర్లతో కలిసి మధ్యాహ్నం గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులోని షాపులపై దాడులు నిర్వహించారు.

గడ్డిఅన్నారం మార్కెట్లో...
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ యార్డులోని బిడ్డింగ్ యార్డులతో పాటుగా 96 షాపులను 6 బృందాలుగా తనిఖీలు నిర్వహించారు.

షాపుల సీజ్
తమ దాడుల్లో నిషేధిత కాల్షియం కార్బైట్‌ను పండ్ల పక్వానికి వాడుతున్న తొమ్మిది షాపులను అధికారులు సీజ్ చేశారు. ఆయా షాపుల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోనేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.

కార్పైడ్ వాడుతున్నారు..
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ యార్డులో కార్బైట్ వాడుతున్న షాపుల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పూర్తి నివేదికను తనకు అందజేయాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సరూర్‌నగర్ తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావుకు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జాయింట్ కలెక్టర్ స్వయంగా..
హైకోర్టు ఆదేశాలు ఉండటంతో రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ తానే స్వయంగా గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఫలాల స్వాధీనం..
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ యార్డులోని సైదా ప్రూట్‌కంపెనీ, జనతా ప్రూట్ కంపెనీ, అలహ్ అహ్మదుల్లా ప్రూట్ కంపెనీ, సత్యవీరారెడ్డి ప్రూట్ కంపెనీ, చీనీ ప్రూట్ కంపెనీ, చంద్రకాత్ బ్రదర్స్ ప్రూట్ కంపెనీ, కాశీ సాయిబాబా ప్రూట్ కంపెనీ, తాజుద్దీన్ అంట్ ప్రూట్ కంపెనీ, శ్రీరాం ప్రూట్ కంపెనీలలలో సపోటా పండ్లను పక్వానికి తెచ్చేందుకు, బత్తాయిని పక్వానికి తెచ్చేందుకు కార్బైట్‌ను వాడుతున్నట్లుగా అధికారులు గుర్తించి వాటిని సీజ్ చేశారు.

నివేదికకు ఆదేశాలు
ఆయా షాపులపై పూర్తి నివేదికను అందజేయాలని జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ తహసీల్దార్‌కు, సంబంధిత విభాగాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల నివేదికను జాయింట్ కలెక్టర్‌కు పంపిస్తున్నామని సరూర్‌నగర్ తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు తెలిపారు.












Click it and Unblock the Notifications