పెట్రోల్ బంక్ డీలర్లకుకమీషన్ పెంపుకు ఆయిల్ కంపెనీల అంగీకారం
హైదరాబాద్ : పెట్రోల్ బంక్ ల డీలర్లకు ఆయిల్ కంపెనీల మద్య కొంత కాలంగా నెలకొన్న వివాదం పరిష్కారమైంది. దీంతో తమ ఆందోళనకు పెట్రోల్ బంక్ డీలర్లు స్వస్తిచెప్పారు.దీంతో బంక్ ల మూసివేత నిర్ణయం రద్దు చేసుకొన్నారు పెట్రోల్ బంక్ ల యజమానులు.
కమీషన్ పెంపు విషయమై కొంతకాలంగా ఆయిల్ కంపెనీలకు , పెట్రోల్ బంక్ ల మద్య వివాదం నడుస్తోంది.ఈ విషయమై విడతల వారీగా పెట్రలో బంక్ లయజమానులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

పెట్రోల్ బంకుల యజమానులకు ఆయిల్ కంపెనీల డీలర్లకు మద్య శుక్రవారం నాడు ముంబాయిలో చర్యలు జరిగాయి. ఈ చర్చలు ఫలవంతమయ్యాయని పెట్రోల్ బంకుల యజమానులు ప్రకటించారు.
ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకే బంకులు తెరిచి ఉంచడం, సెలవు దినాల్లో బంకులు మూసివేయడం లాంటి నిర్ణయాలను పెట్రోల్ బంకులయజమానులు ప్రకటించారు.
అయితే ఆయిల్ కంపెనీలు ప్రతి లీటర్ కు 10 పైసల చొప్పున కమీషన్ పెంచేందుకు ఆయిల్ కంపెనీలు ఒప్పుకోవడంతో ఆందోళననురద్దు చేసుకొన్నారు పెట్రోల్ బంకు యజమానులు.












Click it and Unblock the Notifications