కుప్పకూలిన భవనం: ఒకరు మృతి, మరొకరికి గాయాలు
హైదరాబాద్: నగరంలోని చందానగర్ హుడా కాలనీలో పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబు ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకున్న భవన నిర్మాణ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరొకరికి గాయాలయ్యాయి.
హైదరాబాద్ హఫీజ్‌పేట్ డివిజన్‌లోని హుడాకాలనీలో నివాసముండే రాంచందర్ తన ఇంటిని పునర్నిర్మాణం చేయడానికి కూల్చివేసే పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. కాంట్రాక్టర్ యాదగిరి ఐదుగురు కూలీలతో పురాతన భవనాన్ని కూల్చివేసే పనులను ప్రారంభించారు.

మహబూబాబాద్ జిల్లా మాల్యాల సాదుతండాకు చెందిన వీరన్న (45), జనగామవాసి సిద్దులు (30) పాపిరెడ్డి కాలనీలో నివాసముంటూ.. కూలి పనులను చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరు మరో ముగ్గురితో కలిసి ఈ భవన కూల్చివేత చేపట్టారు. మంగళవారం సాయంత్రం 4.30 ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గోడ, స్లాబు కుప్పకూలిపోయాయి.
గోడ పక్కనే ఉన్న వీరన్న తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడే ఉన్న సిద్దులుకు తీవ్ర గాయాలయ్యాయి. జీహెచ్‌ఎంసీ అధికారులు గాయపడిన సిద్దులును స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మృతుడు వీరన్నకు భార్య భారతి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సిద్దులుకు భార్య యాదమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు.
కాగా, అనుమతి లేకుండానే పురాతన భవనాన్ని కూల్చివేసే పనులను యజమాని చేపట్టినట్లు జీహెచ్‌ఎంసీ అధికారులు నిర్ధారించారు. చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ పరిశీలించారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వం ద్వారా సాయమందిస్తామని చెప్పారు.
-
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications