రియోలో సత్తా చాటాలి: సానియాకు కేటీఆర్ వీడ్కోలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి రియో ఒలింపింక్స్‌కు ఎంపికైన అథ్లెట్లకు తెలంగాణ ప్రభుత్వం, పీబీఎల్‌ హైదరాబాద్‌ హంటర్స్‌ టీమ్‌ యాజమాన్యం శుక్రవారం వీడ్కోలు పలికింది. నగరంలోన ట్రైడెంట్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర టెన్నిస్‌, బ్యాడ్మింటన్‌ సంఘాల అధ్యక్షుడు కేటీ రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి క్రీడాకారులు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా, షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత, సుమీత రెడ్డి, అశ్విని పొన్నప్ప, మను అత్రి, స్ర్పింటర్‌ ద్యూతీ చంద్‌‌లతో పాటు ఇండియన్ బాడ్మింటన్ టీమ్ కోచ్ పుల్లెల గోపిచంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ వేదికగా ఒలింపిక్ పోటీలు నిర్వహిస్తామనే ఆశాభావం ఉందన్నారు.

క్రీడాకారులు ఎన్ని అంతర్జాతీయ టైటిల్స్‌ నెగ్గి వ్యక్తిగతంగా ఎంత కీర్తి సంపాదించినా, ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుందని అన్నారు. హైదరాబాద్‌ నగరం ఇప్పటికే బ్యాడ్మింటన్‌, టెన్నిస్‌లో భారత రాజధానిగా రూపాంతరం చెందిందని అన్నారు.

ఈ రెండు విభాగాలతో పాటు అథ్లెటిక్స్‌లో హైదరాబాద్‌ నుంచి రియోలో పాల్గొంటున్న ప్లేయర్లందరికీ తెలంగాణ ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు పలుకుతూ వీడ్కోలు పలుకుతున్నామని చెప్పారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

ఈ సందర్భంగా ఒలింపిక్స్‌లో స్వర్ణానికి రెండు కోట్లు, రజతానికి కోటి, కాంస్యానికి రూ. 50 లక్షలు ఇస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

ఈ దేశంలో ప్రభుత్వాలు క్రీడలకు తగినంత ప్రోత్సాహం ఇవ్వడం లేదన్నది వాస్తవమని అన్నారు. క్రీడాకారులు స్వతహాగానే ఎదిగి భారత పతాకాన్ని ఒలింపిక్స్‌లో నిలబెట్టే స్థాయికి వచ్చినప్పుడు వారిని గుర్తించడం ప్రభుత్వాల కనీస బాధ్యత అని చెప్పారు. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అదే పని చేస్తోందని చెప్పారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

హైదరాబాద్ నుంచి రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన ఆటగాళ్ల బృందంతో తెలంగాణ క్రీడల మంత్రి పద్మారావు కూడా రియోకు వెళ్తున్నారని తెలిపారు. అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకొని భవిష్యతలో మన రాష్ట్రంలో, నగరంలో క్రీడలకు సంబందించిన మౌలిక సదుపాయాలు ఏర్పాటుపై రిపోర్టును ముఖ్యమంత్రికి అందిస్తారని తెలిపారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో హైదరాబాద్‌ ఒలింపియన్లు బ్రహ్మాండమైన ఫలితాలు సాధిస్తారన్న నమ్మకం ఉందన్నారు. మంచి సపోర్ట్‌, కోచింగ్‌ స్టాఫ్‌ సహకారంతో వారు బాగా రాణిస్తారని ఆశిస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

ఈ కార్యక్రమంలోసాయ్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపూరి రమేశ్‌, హైదరాబాద్‌ హంటర్స్‌ యజమాని డాక్టర్‌ వీఆర్‌కే రావు, రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా, హైదరాబాద్‌ బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వర్‌ నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

సానియా మిర్జా మాట్లాడుతూ తనపై ఎప్పుడూ అంచనాలు ఉండడం సహజమని చెప్పింది. తామంతా ఒలింపిక్స్‌లో అందరం శక్తిమేరకు రాణిస్తామని తెలిపింది. రియోలో వంద శాతం అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని ఆమె చెప్పారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

పీవీ సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు ఎంపికై, దేశానికి ఆడుతున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత రియోకు ముందు పీబీఎల్‌, డెన్మార్క్‌, మలేసియా ఓపెన్‌, మకావు ఓపెన్‌లో ఆడడంతో ఆత్మ విశ్వాసం పెరిగిందని చెప్పారు.

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

రియోలో సత్తా చాటండి: అథ్లెట్లకు కేటీఆర్ వీడ్కోలు

జ్వాలా గుత్తా మాట్లాడుతూ చాలా మంది మాపై ఎన్నో అంచనాలు ఉంచారు. క్రీడాకారులుగా మాకు అదే గర్వకారణమని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఈ సారి ఎక్కువ మంది వెళ్తున్నామని చెప్పిన జ్వాలా డబుల్స్‌లో 16 జట్లు ఉన్నాయని అన్నారు. అశ్విని, నేనైతే.. బాగా కష్ట పడుతున్నాం. ఐదు నెలల నుంచి కేవలం ఆటపైనే దృష్టి పెట్టామని చెప్పారు. రోజుకు ఏడెనిమిది గంటలు ప్రాక్టీస్‌ చేస్తున్నామని చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hyderabad Hunters, franchisee team of the Premier Badminton League (PBL) today hosted a gala dinner as part of the farewell celebrations, wishing the players good luck, for the Rio Olympic starting this August.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X