తెలంగాణాలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు; తాజాగా వరంగల్ లో మరో ఒమిక్రాన్ కేసు

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిత్యం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అవుతున్న తీరు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు, ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తుంది. డెల్టా వేరియంట్ కంటే మూడు రెట్లు అధికంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడం, క్రమక్రమంగా కొత్త జిల్లాలలో కేసులు నమోదవుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని నివారించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

స్విట్జర్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

స్విట్జర్లాండ్ నుండి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్

తాజాగా వరంగల్ జిల్లాలో మరో ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదయింది. ఇటీవల స్విట్జర్లాండ్ నుండి వచ్చిన 24 సంవత్సరాల వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయింది . ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే వెంకట రమణ సోమవారం ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు . డిసెంబర్ 12వ తేదీన ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి వరంగల్ లోని బ్యాంకు కాలనీకి చేరుకున్నారని, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో అతనికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారని వెల్లడించారు. అయితే ఆ పరీక్షల్లో అతనికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు.

హైదరాబాద్ టిమ్స్ కు బాధితుడు, అతని కుటుంబానికి నిర్వహిస్తున్న పరీక్షలు

హైదరాబాద్ టిమ్స్ కు బాధితుడు, అతని కుటుంబానికి నిర్వహిస్తున్న పరీక్షలు

వెంటనే సదరు వ్యక్తిని హైదరాబాదులోని టిమ్స్ ఆస్పత్రికి వైద్య సేవల కోసం రిఫర్ చేశామని పేర్కొన్నారు. అతనికి దగ్గరగా ఉన్న తన కుటుంబ సభ్యులను, బంధు మిత్రులను కూడా ఐసోలేట్ చేశామని, వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రిపోర్టుల కోసం చూస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 44 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కాగా, ఆ సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తుంది. విదేశాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న వారికి నిర్వహించే పరీక్షలలో రిస్క్ లేని దేశాల నుంచి వస్తున్న వారిలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కనిపిస్తుంది .

 గతంలో యూకే నుండి వచ్చిన మహిళకు ఒమిక్రాన్

గతంలో యూకే నుండి వచ్చిన మహిళకు ఒమిక్రాన్

గతంలోనూ వరంగల్ జిల్లాలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదు అయ్యింది. వరంగల్ జిల్లాలో యూకే నుంచి వచ్చిన మహిళకు ఒమిక్రాన్ వేరియంట్ గా నిర్ధారణ అయ్యింది. శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన మహిళకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వరంగల్ జిల్లాలో మొదటి కేసు నమోదైంది. ఇప్పుడు మరో కేసు నమోదైంది.

 తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ మూడు కేసులు

తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ మూడు కేసులు

ఇక తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ మరో ముగ్గురికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ కాగా, అతని భార్య, తల్లి, స్నేహితుడికి తాజాగా ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీరికి బాగా సన్నిహితంగా ఉన్నవారిని హోం ఐసోలేట్ చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.

క్రమంగా పెరుగుతున్న కేసులతో ఆందోళన

క్రమంగా పెరుగుతున్న కేసులతో ఆందోళన

మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు ప్రస్తుతం తెలంగాణ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా పరిణామాల దృష్ట్యా ప్రజలు కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూర నిబంధనలను పాటించాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని వైద్య శాఖ అధికారులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇక దేశ వ్యాప్తంగానూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+