తెలంగాణలోకి ఒమిక్రాన్ ప్ర‌వేశం.. ఆరోగ్యశాఖ ఆప్ర‌మ‌త్తం

క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ప్ర‌పంచ దేశాల‌ను గ‌జ‌గజ‌లాడిస్తుంది. ఇప్ప‌టికే దాదాపు అన్ని దేశాల‌కు వ్యాప్తి చెందింది. తాజాగా తెలంగాణ‌లోకి ఒమిక్రాన్ వేరియంట్ ప్ర‌వేశించింది. విదేశాల నుంచి వ‌చ్చిన ఇద్ద‌రికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిందని తెలంగాణ వైద్యాధికారులు తెలిపారు.

ఇద్ద‌రికి ఒమిక్రాన్ పాజిటివ్‌

ఇద్ద‌రికి ఒమిక్రాన్ పాజిటివ్‌


ఈనెల 12 వ‌తేదిన సోమాలియా, కెన్యా నుంచి వ‌చ్చిన ఇద్ద‌రు వ్య‌క్తులకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో క‌రోన ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఆ ఇద్ద‌రికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు తెలంగాణ వైద్యారోగ్య సంచాల‌కులు శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు. వీరిలో కెన్యా నుంచి వ‌చ్చిన యువ‌తి వయ‌సు 24 సంవ‌త్స‌రాలు .. సోమాలియా నుంచి వ‌చ్చిన వ్య‌క్తికి 23 సంవ‌త్స‌రాలు అని తెలిపారు. వీరిద్ద‌రిని హైద‌రాబాద్‌లోని టీమ్స్‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్న‌ట్లు చెప్పారు.

ఏడు సంవ‌త్స‌రాల బాలుడుకి ఒమిక్రాన్‌

ఏడు సంవ‌త్స‌రాల బాలుడుకి ఒమిక్రాన్‌

వీరిద్ద‌రికి ఈనెల 12న కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. త‌ర్వాత వీరి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్స్‌కు పంపారు. కాగా గ‌త రాత్రి వారి ఫ‌లితాలు వ‌చ్చాయని శ్రీనివాస్‌రావు తెలిపారు. జీనోమ్ సీక్వేన్స్ రిపోర్ట్స్ లో వీరికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. వీరిద్ద‌రూ కూడా హైద‌రాబాద్ లోని టోలీచౌకీ, మోహిదీప‌ట్నంలో ఉంటున్నారు. వీరి ఇరువురి కుటుంబ స‌భ్యుల‌కు ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. అంతే కాకుండా తాజాగా మ‌రో వ్య‌క్తికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. మూడో వ్య‌క్తి వ‌య‌సు ఏడు సంవ‌త్స‌రాల బాలుడు అని చెప్పారు.. ఆ బాలుడిది పశ్చిమ బెంగాల్ అని పేర్కొన్నారు. అయితే ఈ బాలుడు హైద‌రాబాద్ వాసి కాద‌ని వెల్ల‌డించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో దిగిన వెంట‌నే ఆ బాలుడు కోల్‌క‌తాకు వెళ్లాడ‌ని శ్రీనివాస్ రావు వెల్ల‌డించారు.

ఆరోగ్యశాఖ కీల‌క స‌మావేశం

ఆరోగ్యశాఖ కీల‌క స‌మావేశం

తెలంగాణ‌లో ఒమిక్రాన్ ప్ర‌వేశించ‌డంతో ఆరోగ్యశాఖ‌ ఆప్ర‌మ‌త్త‌మైంది. ఈనేప‌థ్యంలో ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌రీశ్‌రావు ఆధ్య‌క్ష‌త‌న కీల‌క నిర్వ‌హించ‌నుంది. ఈ స‌మావేశంలో క‌రోనా థ‌ర్డ్‌వేవ్‌ను స‌మ‌ర్ధ‌వంతంగా ఎదుర్కొనే ప్ర‌ణాళిక‌ల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మందులు, ఆక్సిజ‌న్, టెస్టింగ్ కిట్లు , ఆస్ప‌త్రి బెడ్లు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనుంది. ధ‌ర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని, ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+