టీఎస్ఆర్టీసీ ఉగాది కానుక: సీనియర్ సిటిజన్లకు ఆరోజు ప్రయాణం ఉచితమే
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి వినూత్న తరహాలు ప్రయాణికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆఫర్లను పలు సందర్భాల్లో ప్రకటించిన ఆర్టీసీ.. తాజాగా ఉగాది పర్వ దినాన్ని పురస్కరించుకుని మరో బంపరాఫర్ ప్రకటించింది.
ఇప్పటికే చిన్నారులకు, మహిళలకు పలు ఆఫర్లు ప్రకటించిన ఆర్టీసీ.. తాజాగా, ఉగాది పండగ రోజున సీనియర్ సిటిజెన్లకు కానుక ఇచ్చింది. ఉగాది పండగ సందర్భంగా కేవలం ఏప్రిల్ 2వ తేదీన.. వృద్ధులకు ఉచిత ప్రయాణం ఆఫర్ చేసింది. బస్సుల్లో ప్రయాణించేటపుడు తమ దగ్గర ఉన్న గుర్తింపు కార్డును (65 ఏళ్లు దాటినట్లు) కండక్టర్‌కు చూపించి ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. ఉగాది సందర్భంగా ఈ ప్రత్యేకమైన ఆఫర్ తీసుకొచ్చినట్టు వెల్లడించారు తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

ఇటీవలే ఛార్జీలు పెంచిన ఆర్టీసీ
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంతో రాష్ట్ర ప్రజలపై భారం పడగా, ఇప్పుడు టీఎస్ఆర్టీసీ కూడా బస్సు ఛార్జీలను పెంచి ప్రయాణికుల నడ్డివిరిచింది. ప్యాసించర్ సెస్ పేరుతో ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లను పెంచింది. పెంచిన ఛార్జీలు తక్షణమే అమల్లోకి వస్తాయని టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. అకస్మాత్తుగా ఛార్జీలు పెంచడంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంపుతో ఆందోళన చెందుతుంటే.. తాజాగా, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతారా? అని ప్రయాణికులు మండిపడుతున్నారు. ఇలా అన్ని ధరలు పెంచేస్తే సామాన్యులు ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
On the occasion of #Ugadi #TSRTC Offers Free Ride to Senior Citizens above 65 years only on 2nd April 2022 in all types of #TSRTCBusServices @TSRTCHQ @ntdailyonline @TV9Telugu @Eenadu_Newspapr @sakshinews @way2_news @TelanganaToday @IndiaToday @bbcnewstelugu @baraju_SuperHit pic.twitter.com/v5fUK4uOyL
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) March 31, 2022
కాగా, హైదరాబాద్ సిటీ బస్సుల్లో బస్‌పాస్ ఛార్జీలను పెంచుతూ గతంలో నిర్ణయం తీసుకుంది. ఈ ఛార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి. జనరల్ బస్ టికెట్ పాసుల కేటగిరిలో ఆర్డినరీ పాస్ చార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు, ఎంఎంటీఎస్-ఆర్టీసీ కోంబో టికెట్ ఛార్జీ రూ.1,090 నుంచి రూ.1,350కి పెరిగింది.
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications