తెలంగాణలో మరోసారి కులగణన సర్వే షురూ.. ఎన్ని పద్దతుల్లో అంటే ?
తెలంగాణ వ్యాప్తంగా కులగణన వివరాల నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. నేటి నుంచి ఈనెల 28 వరకు మరోసారి కులగణన సర్వేలో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
ఈ సర్వేను ప్రభుత్వం మూడు పద్ధతుల్లో చేపట్టనుంది. గతంలో నిర్వహించిన సర్వేలో మొత్తం 1,15,71,457 కుటుంబాలకు గాను 1,12,15,134 కుటుంబాలను సర్వే చేయడం జరిగిందని అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో కులగణన సర్వేలో పాల్గొనని 3,56,323 కుటుంబాలకు సర్కారు మరో అవకాశం ఇస్తోంది.
రెండోసారి సర్వేకోసం మూడంచెల విధానాన్ని ఎంపిక చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ వివరాలు సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేస్తుందని తెలిపారు. ఫోన్ చేసిన వారి ఇళ్లకి వెళ్లి ఎన్యుమరేటర్లు వివరాలు నమోదు చేసుకోనున్నారు.

ఎంపీడీవో కార్యాలయం, వార్డు ఆఫీసులకు వెళ్లి కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ డౌన్ లోడ్ చేసుకోని వివరాలు నమోదు చేసి, సంతం చేసిన తర్వాత అధికారులకు సమర్పించాలని ప్లానింగ్ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. ఇక మూడో విధానంలో నేరుగా ప్రజా పాలన కేంద్రానికి వెళ్లి అక్కడే దరఖాస్తు నింపి ఇవ్వొచ్చన్నారు. ఆధార్ నంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్‌తో పాటుగా పోస్టల్ పిన్ కోడ్ నెంబర్ ను తెలియజేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
గతేడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో 50 రోజుల పాటు నిర్వహించిన సర్వే నిర్వహించారు. కొన్ని కుటుంబాల నుంచి వివరాలకు అందకపోవడంతో మరో 13 రోజుల పాటు ఇప్పుడు మళ్లీ సర్వే చేపడుతున్నారు.
సర్వేకు సహకరించకుండా వివరాలు ఇచ్చేందుకు నిరాకరించిన వారికి ప్రభుత్వ సర్వేను ప్రశ్నించే అవకాశామే లేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications