హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కూటమి గెలిస్తే నెలన్నరకో ముఖ్యమంత్రి: కేటీఆర్, కేసీఆర్‌ను జైల్లో పెడతారా: హరీష్ రావు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Telangana Elections 2018 : కూటమి గెలిస్తే నెలన్నరకో ముఖ్యమంత్రి : కేటీఆర్ | Oneindia Telugu

హైదరాబాద్/నల్గొండ: కేసీఆర్‌ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని మంత్రి కేటీ రామారావు పిలుపునిచ్చారు. సోమవారం దానం నాగేందర్‌కు మద్దతుగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కూటమి గెలిస్తే నెలన్నరకో ముఖ్యమంత్రి మారుతాడని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ వంటి సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుందని చెప్పారు. మహాకూటమి సీఎంను నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి నిర్ణయించాలని, అదీ సీల్డ్‌ కవర్‌లో వస్తుందని చెప్పారు. తెలంగాణకు సీల్డ్‌ కవర్‌ ముఖ్యమంత్రి కావాలా లేక కేసీఆర్ వంటి దమ్మున్న నేత కావాలా అన్నారు.

One and half month CM if Congress will win in elections, KTR

జైల్లో పెడతారా: హరీష్ రావు

కూటమి గెలిస్తే తమను జైల్లో పెడతామని కాంగ్రెస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని, కేసీఆర్‌ ఉన్నంత వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాదని హరీష్ రావు భువనగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో అన్నారు. సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే కేసీఆరే మళ్లీ సీఎం కావాలన్నారు.

తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?

One and half month CM if Congress will win in elections, KTR

భువనగిరిలో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది నాడు మాధవరెడ్డి హయాంలో, నేడు పైళ్ల శేఖర్‌ రెడ్డి హయాంలో అన్నారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికాకుండా ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారన్నారని, అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ముద్దు అయ్యారన్నారు.

తెలంగాణ కోసం 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి చావునోట్లోకి పోయేందుకు సిద్ధపడి కేసీఆర్‌ తెలంగాణ తెచ్చారన్నారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌ను జైల్లో పెడతారా అన్నారు. తెరాస తిరిగి అధికారంలోకి వస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

English summary
Telangana IT Minister KT Rama Rao participated in election campaign in Khairatabad on Monday. He said that many CM candidates are there in Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X