డామిట్ కథ అడ్డం తిరిగింది. ఎరక్కపోయి ఇరుక్కున్న సిఎమ్ కేసిర్
ఒక రైతుకు న్యాయం చేస్తే, మరో రైతుకు అన్యాయం జరిగిందా ?.ఇది సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసిఆర్ నిర్ణయంతోనే జరగదని భాదితుడు పిర్యాధు చేశారు.దీంతో రైతుకు న్యాయం చేయాలని తీసుకున్న చోరవ, కాస్త బెడిసి కొట్టిందా ? దీంతో సిఎమ్ కేసిఆర్ సోషల్ మీడియాలో వచ్చిందని స్పందించి, ఎరక్కపోయి ఇరుక్కున్నారా ?

తనకు అన్యాయం జరిగిందంటూ వాట్సప్ లో పోస్ట్ : మంచిర్యాల రైతు
రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా, నెన్నెల మండలం, నందులపల్లే కు గ్రామానికి చెందిన శరత్ అనే రైతు కుటుంభానికి ఏడు ఎకరాల భూమి ఉంది.అయితే గత సంవత్సరం రైతు పట్టాదార్ పాస్ పుస్తకాల్లో పలు మార్పులు తీసుకువచ్చిన ప్రభుత్వం రైతులకు కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చింది. దీంతో విఆర్వో శరత్ భూమిని గ్రామంలో లేని ఇతరులకు పట్టా పాస్ బుక్ చేశారు..కాగా శరత్ కుటుంభం ఆ భూమి గత 55 సంవత్సరాలుగా సాగు చేసుకోవడంతో పాటు, భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, ఆయన ఎన్నిసార్లు అధికారుల వద్దకు వెళ్లీన సమస్య పరిష్కారం కాలేదని,.దీంతో శరత్ నందుల పల్లేకు చెందిన స్థానిక విఆర్వో తనకు సంబంధించిన ఏడు ఎకరాల భూమిని ఇతరుల వద్ద డబ్బులు తీసుకుని వారి పేరు మీద రికార్డ్ చేసి తనకు అన్యాయం చేశారని ,మరోవైపు వీఆర్ వో వల్ల స్థానిక రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ , (వాట్సప్ )సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

నేరుగా రైతుతో ఫోన్లో మాట్లాడిన సిఎమ్ కేసిఆర్
దీన్ని చూసిన ముఖ్యమంత్రి కేసిఆర్ స్పందించారు. వెంటనే సమస్యపై రైతు శరత్ తో ఫోన్లో నేరుగా మాట్లాడారు,విషయాలు తెలుసుకున్న ఆయన వెంటనే సంబంధిత అంశంపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారి చేశారు. దీంతో మంచీర్యాల కలెక్టర్ హుటాహుటిన శరత్ గ్రామానికి వెళ్లి విచారణ జరిపింది, సాయంత్రంలోగా ఆయనకు పాస్ బుక్ ఇచ్చి ,రైతు పెట్టుబడి సైతం అందించింది.

కోత్త వివాదం
అయితే సిఎమ్ కేసిఆర్ నిర్ణయంతో శరత్ అనే రైతు సంతోషంగా ఉన్నాడు .డబ్బులతో వ్యవసాయానికి సిద్దంగా ఉన్నాడు .అయితే ఇక్కడే కథ అడ్డం తిరిగింది. పాస్ బుక్ పోందిన రైతు శరత్ తప్పుుడు సమాచారంతో సిఎమ్ కేసిఆర్ ను తప్పుదోవ పట్టించారని అంతకుముందు పాస్ బుక్ పోందిన కోండపల్లి మల్లయ్య కూతురు జ్యోతి తమకు అన్యాయం జరిగిందని అదే వాట్సప్ లో పోస్ట్ చేసింది. కాగా ఇది రెండు కుటుంభాల మధ్య ఉన్న భూమి తగాదా అని ,కాని సిఎమ్ కేసిఆర్ శరత్ మాటలను నమ్మి మాకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపింది.

మరోసారి అధికారుల నిర్లక్ష్యం
మొత్తం మీద మొదటి సారి రైతులకు అన్యాయం జరగుతుందని నేరుగా స్పందించిన సిఎమ్ కేసిఆర్ శ్రమకు ఫలితం లేకుండా పోయింది..వాస్తవానికి ఇలాంటీ సమస్యలను రెవెన్యు అధికారలు స్థానికంగా ఉన్న ప్రజలవద్దకు వెళ్లి విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి.దీంతో వాటిని అక్కడిక్కడే పరిష్కరించే అవకాశాలు కూడా ఉంటాయి అయినా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో విషయం సిఎమ్ వరకు చేరింది . అప్పుడు కూడ ఇరు వర్గాలను సంప్రదించి చేయాల్సిన సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు సిఎమ్ మెప్పు కోసం ఇలా చేయడంతో సిఎమ్ కు చిక్కులు వచ్చే పడే అవకాశాలు ఉంటాయా అనే సందేహలు వెలువడుతున్నాయి.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications