ప్రాణం తీసిన ఈత సరదా, ఉద్యోగి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తూ చెక్ డ్యాంలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం పెద్దఅంబర్‌పేటలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివారాలిలా ఉన్నాయి.
గ్రామానికి చెందిన ఫయాజ్ (13) తన స్నేహితులతో కలిసి ఆదివారం ఈత కొట్టేందుకు చెక్ డ్యాం వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తూ చెక్‌డ్యాంలో పడి మృతి చెందాడు. ఈ సమాచారాన్ని స్నేహితులు తల్లిదండ్రులకు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని డ్యాంలో నుంచి వెలికితీశారు.

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్యోగి అనుమానాస్పద మృతి
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి ఉద్యోగి శ్యామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అత్తాపూర్ పిల్లర్ నెంబరు 111 దగ్గర శ్యామ్ మృతదేహం పడి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహంపై గాయాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
-
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
డబుల్ బెడ్ రూం ఇళ్లపై ప్రభుత్వం కీలక ప్రకటన- వీరికే, పంపిణీ ముహూర్తం ఫిక్స్...!! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!!












Click it and Unblock the Notifications