తెలుగు టెక్కీ మృతి: 13గంటల్లో కోటి 66లక్షల విరాళాలు అందించారు

అమెరికాలోని కన్సాస్‌లో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్లకు సాయమందించేందుకు అనేక మంది ముందుకు వచ్చారు.

హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్‌లో జాత్యాహంకారంతో ఆడమ్ పూరింటన్ అనే వ్యక్తి జరిపిన కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్లకు సాయమందించేందుకు అనేక మంది ముందుకు వచ్చారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు. అంతేగాక, అతని కుటుంబానికి 2,60,000 డాలర్ల(రూ. కోటి66లక్షలు) ఆర్థిక సాయాన్ని కూడా అందించారు.

శ్రీనివాస్ కూచిభొట్లకు ఆర్థిక సాయమందించేందు కోసం గో ఫండ్ మి పేజీని క్రియేట్ చేసి దాని ద్వారా డబ్బు సేకరించారు. లక్షా50వేల డాలర్లు సేకరించాలని ఈ పేజీని క్రియేట్ చేసినప్పటికీ.. సాయం చేసేందుకు చాలా మంది ముందుకు రావడంతో అది 2,50,000డాలర్లను దాటేసింది. ఈ మొత్తాన్ని కూడా శ్రీనివాస్ కుటుంబానికి అందజేయనున్నారు.

Online Campaign For Indian Killed In Kansas Raises $260,000 In 13 Hours

ఎన్నారైలతోపాటు అమెరికన్లు కూడా పెద్ద మొత్తంలో విరాళాలు అందజేయడం గమనార్హం. మొత్తం 7వేలకుపైగా మంది ప్రజలు విరాళాలను అందజేశారు. కాగా, పూరింటన్ కాల్పులు జరిపిన ఘటనలో వరంగల్‌కు అలోక్ మాదాసికి తీవ్రగాయాలయ్యాయి. కాగా, వీరిద్దరిని కాపాడేందుకు ఓ 24ఏళ్ల అమెరికాన్ ఇయాన్ గ్రిల్లట్ ప్రయత్నించి గాయాలపాలయ్యాడు. ప్రస్తుతం అలోక్, గ్రిల్లట్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+