జులై 1 నుంచి తెలంగాణలో కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులు: గత ఏడాది ఫీజుల విధానమే
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 1 నుంచి ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రడ్యూయేషన్ వరకు ఆన్‌లైన్ తరగతులు మొదలుకానున్నట్లు ప్రకటించింది. ఈ ఏర్పాట్ల కోసం ఇప్పటికే ప్రభుత్వ టీచర్లు జూన్ 25 నుంచి స్కూళ్లకు వెళ్తున్నారు. ఆఫ్‌లైన్ తరగతులు ప్రారంభించాలనుకున్నా.. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ తరగతులే నిర్వహించాలని కేసీఆర్ చెప్పారని.. అందుకే కేజీ నుంచి పీజీ వరకు ఆన్‌లైన్ తరగతులే నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులు ఆన్‌లైన్ తరగతులను వీక్షించవచ్చని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాస్ట్రంలో లేనివిధంగా కరోనా కాలంలోనూ తెలంగాణ విద్యా వ్యవస్థ పనిచేసిందని అన్నారు. డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని, కామన్ ఎంట్రాన్స్ టెస్ట్ తేదీల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని మంత్రి స్పష్టం చేశారు.

ఈ ఏడాది కూడా విద్యా సంస్థలు కేవలం ట్యూషన్ పీజును మాత్రమే వసూలు చేయాలని, 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. 50 శాతం టీచర్లు స్కూళ్లకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒకటి, రెండు తరగతి పిల్లలకు ఆగస్టు 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. గత ఏడాదిలానే 46 జీవో అమలవుతుందని తెలిపారు. పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని, ద్వితీయ సంవత్సరం ఫలితాలు క్రైటీరియా నచ్చకపోతే ఆ విద్యార్థిలకు పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి.
కాగా, సోమవారం ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్టుగా ప్రకటించారు. ఉత్తీర్ణత సాధించినవారిలో 2,28,754 మంది బాలికలు, 2,22,831 బాలురు ఉన్నారు. 1,76, 719 మంది ఏ గ్రేడ్, 1,04, 886 మంది బీ గ్రేడ్, 61,887 మంది సీ గ్రేడ్, 1,08,093 మంది డీ గ్రేడ్ సాధించారు. మొదటి సంవత్సరం మార్కులనే ద్వితీయ సంవత్సరంకు వర్తింపజేశారు. ప్రాక్టికల్స్ మార్క్స్ మాత్రం అందరికి గరిష్టంగా కేటాయించారు. గతంలో ఫెయిల్ అయిన వారికి 35శాతం మార్కులతో పాస్ చేశారు.












Click it and Unblock the Notifications