ముంబై యువతులతో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్: నిర్వాహకుల అరెస్ట్
బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా ఆన్‌లైన్‌లో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: బెంగళూరు, హైదరాబాద్ కేంద్రాలుగా ఆన్‌లైన్‌లో వ్యభిచార కార్యకలాపాలు సాగిస్తున్న ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. సీఐ కుశాల్కర్ కథనం ప్రకారం.. బెంగళూరుకు చెందిన నూర్ అహ్మద్, అలీమ్, ఉమర్ ఫారూఖ్, శశికుమార్ కొంత కాలంగా వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో కేపీహెచ్‌బీ ఠాణా పరిధిలోని 6వ ఫేజ్‌లోని ఓ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ముంబైకి చెందిన యువతులను ఉంచారు. ఆన్‌లైన్‌లో విటులతో బేరసారాలు సాగిస్తున్నారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం రాత్రి ఆ ఇంటిపై దాడి చేసి ఓ యువతితో పాటు నలుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు.
ఫేస్‌బుక్ పరిచయం: నెక్లెస్‌తో ఉడాయించిన యువకుడి అరెస్ట్
ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడు తనకు నచ్చిన డిజైన్‌లో నెక్ల్లెస్ తయారు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా ఉడాయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సదరు మోసగాడిని అరెస్ట్‌చేసిన నెక్ల్లెస్‌ను స్వాధీన పర్చుకున్నారు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

డీఐ కె నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట రెడ్డీకాలనీలో నివసించే అరవింద్‌కుమార్, మాధవిలత భార్యభర్తలు. స్థానికంగా శ్రీస్వర్ణ జువైలరీ షాపును నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచమైన ఖమ్మంకు చెందిన తంగెళ్ల నాగేంద్రవర్మ తాను సినిమా ఆర్టిస్ట్‌నని, బంజరాహిల్స్‌లో ఉంటానని పలువురు సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని వారికి నమ్మించాడు.
డిసెంబర్12న ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా తనకు బంగారు నెక్ల్లెస్ తయారుచేసి ఇవ్వాలని, నచ్చిన డిజైన్ ఫేస్ బుక్ ద్వారా పంపాడు. దీంతో వారు 55 గ్రాములతో లక్షా, ఆరవై ఏడు వేల రూపాయల విలువైన బంగారుతో నెక్ల్లెస్ సిద్ధం చేశామని సమాచారం ఇచ్చారు. నెక్ల్లెస్ సిద్ధమైందని తెలియటంతో డిసెంబర్ 15వ తేది చంపాపేటలోని షాపుకు వచ్చాడు.
బంగారు నెక్ల్లెస్ తీసుకున్న తర్వాత తన వద్ద పాత కరెన్సీ నోట్లు ఉన్నాయని, వాటిని తీసుకోవాలని లేకపోతే ఆన్‌లైన్ ద్వారా నగదును ట్రాన్స్‌ఫర్ చేస్తానని చెప్పి సెల్‌ఫోన్ నెంబర్ ఇచ్చి నమ్మించాడు. దీంతో వారు అతన్ని నమ్మి నెక్ల్లెస్ అప్పగించారు. మూడు రోజులైన డబ్బులను ట్రాన్స్‌ఫర్ కాలేదు.
దీంతో మోసపోయామని గ్రహించిన షాపు నిర్వాహకులు అరవింద్‌కుమార్, మాధవీలత సైదాబాద్ పోలీసు లకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు డీఐ కె.నాగేశ్వరరావు క్రైమ్‌పార్టీ బృందం నగేంద్ర వర్మ సెల్‌ఫోన్ నెంబర్ ఆధారంగా అతన్ని అరెస్ట్‌చేసి నెక్ల్లెస్‌ను స్వాధీన పర్చుకుని మంగళ వారం రిమాండ్‌కు తరలించారు.












Click it and Unblock the Notifications