మోడల్స్ నుంచి, అర్ధనగ్న చిత్రాలతో వల: ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ రట్టు, పట్టుబడిన ఉజ్జెకిస్తాన్ యువతి

ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు శనివారం అరెస్టు చేసారు. పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలోని

హైదరాబాద్: ఆన్‌లైన్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్వోటీ) పోలీసులు శనివారం అరెస్టు చేసారు. పోలీస్ కమిషనర్ మహేష్ భాగవత్ వివరాలు వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లాలోని దేవరపల్లికి చెందిన జోగేశ్వర రావు కృష్ణానగర్, ఎస్సార్ నగర్‌లలో ఉంటున్నాడు.

ఈ క్రమంలో కొంతమంది వ్యభిచార ముఠా సభ్యులతో పరిచయం ఏర్పడింది. టెక్నాలజీని ఉపయోగించి యువకులను ఆకర్షించే విధంగా యువతుల అర్ధనగ్న చిత్రాలను వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేసేవాడు.

వేరే రాష్ట్రాల మోడల్స్ నుంచి విదేశీ మహిళలు

వేరే రాష్ట్రాల మోడల్స్ నుంచి విదేశీ మహిళలు

ఇతర రాష్ట్రాలకు చెందిన మోడల్స్, ఆర్టిస్టులు, విదేశీ మహిళలు, యాంకర్లను కూడా ఈ వ్యభిచార రొంపిలోకి దింపేవాడుత. ఇతర రాష్ట్రాల వ్యభిచార నిర్వాహకులకు ఐదు నుంచి పది రోజుల నగదు ముందస్తుగా చెల్లించి విమాన టిక్కెట్లు సమకూర్చి నగరంలోని స్టార్ హోటల్స్‌లలో యువతులను ఉంచేవాడు. విటుల దగ్గర నుంచి వేలు, లక్షల రూపాయలు వసూలు చేసేవాడు.

మరో వ్యభిచార ముఠాతో జతకలిసి

మరో వ్యభిచార ముఠాతో జతకలిసి

మరో వ్యభిచార నిర్వాహకుడు కేసన గోపాల్ గతంలో పోలీసులు అరెస్టు చేసిన లక్ష్మన్నగారి గోపాల్‌తో కలిసి కొంతమంది అమ్మాయిలతో వ్యభిచారం చేయిస్తున్నాడు. ఇందులో ఒకరు గుంటూరు జిల్లా వాసి కాగా, మరొకరు జోగులాంబ గద్వాల జిల్లావాసి. ఆ తర్వాత జోగేశ్వర రావు, లక్ష్మన్నగారి గోపాల్, కేసన గోపాల్ ముగ్గురికి పరిచయం ఏర్పడింది.

ఢిల్లీకి చెందిన వ్యక్తితో పరిచయం

ఢిల్లీకి చెందిన వ్యక్తితో పరిచయం


వీరికి ఢిల్లీకి చెందిన ఉస్మాన్‌ పరిచయం కావడంతో వారంతా అన్‌లైన్‌ ద్వారా వ్యభిచారం నిర్వహించేందుకు పథకం వేశారు. ఇతర దేశాలకు చెందిన యువతులను ఊబిలోకి దించుతూ విటుల నుంచి రూ.50వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తూ పబ్బం గడుపుకొంటున్నారు.

ఉజ్జెకిస్తాన్ యువతిని తీసుకువచ్చి

ఉజ్జెకిస్తాన్ యువతిని తీసుకువచ్చి

ఉజ్బెకిస్థాన్‌కు చెందిన 26 ఏళ్ల యువతిని ఆరు నెలల టూరిస్ట్‌ విసా కింద హైదరాబాదుకు తీసుకువచ్చారు. ఓ స్టార్ హోటల్‌లో బస కల్పించి ఆన్‌లైన్‌లో విటులను ఆకట్టుకుని ఆమెను వారి వద్దకు పంపుతున్నారు.

పోలీసుల డెకాయ్ ఆపరేషన్

పోలీసుల డెకాయ్ ఆపరేషన్

ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీకృష్ణానగర్‌ నుంచి విటుడు మాట్లాడుతున్నట్లు పోలీసులే డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించడంతో గుట్టు రట్టయింది. ప్రధాన నిందితులైన జోగీశ్వర్‌రావు, గోపాల్‌ అలియాస్‌ రఘునాథ్‌రెడ్డి, గోపాల్‌తో పాటు ఉజ్బెకిస్థాన్‌ యువతిని అరెస్టు చేసి సరూర్‌నగర్‌ ఠాణాలో అప్పగించారు.

వ్యభిచార వ్యాపారంలోకి ఇలా.. ఉజ్జెకిస్తాన్ యువతి

వ్యభిచార వ్యాపారంలోకి ఇలా.. ఉజ్జెకిస్తాన్ యువతి

పోలీసులు వీరి నుంచి రూ.25 వేల నగదు, కారు, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఉజ్జెకిస్తాన్ యువతి ఆరు నెలల టూరిస్ట్ వీసాపై హైదరాబాద్ వచ్చినప్పటికీ.. ఆమె వచ్చి తొమ్మిది నెలలు అవుతోందని తెలుస్తోంది. గోవా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌కు చెందిన వ్యభిచార నిర్వాహకులతో పరిచయం ఏర్పడి తాను ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టినట్లు ఉజ్జెకిస్తాన్ బాధితురాలు పోలీసులకు వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+