'ఆపరేషన్ సిందూర్'.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది భారత ఆర్మీ. పాకిస్థాన్‌లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపుదాడులు నిర్వహించింది. 'ఆపరేషన్ సిందూర్' పేరుతో మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట 44 నిమిషాలకు దాడులు చేపట్టింది.
కేవలం 25 నిమిషాల్లోనే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ప్రాంతాల్లో దాడులు చేసింది. భారత్ నిర్వహించిన ఈ దాడుల్లో దాదాపు 70 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు కేంద్ర రక్షణశాఖ పేర్కొంది. మరో 60 మంది గాయాలపాలైనట్లు పేర్కొంది. భారత ఆర్మీ నిర్వహించిన ఈ మెరుపు దాడుల్లో ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మూసూద్ అజహర్ కుటుంబంలోని 14 మంది హతం అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ధృవీకరించాడు.
అయితే ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ను ఆయన సమర్థించారు. భారత్ సరైన పని చేసిందని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో హిందువులను గుర్తించి మరీ ఉగ్రవాదులు చంపారని.. వారికి ఆపరేషన్ సిందూర్ ఓ గుణపాఠం అని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదులు బాధిత మహిళతో 'మోదీకి చెప్పుకో' అన్నారు.. ఇప్పుడు మోదీ రియాక్షన్ చూపించారని ఆయన గుర్తు చేశారు. హిందూ మహిళల బొట్టు తీస్తే ఎలా ఉంటుందో చిన్న శాంపిల్ మాత్రమేనని తెలిపారు.

పాకిస్థాన్ ను పూర్తిగా నాశనం చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ పేర్కొన్నారు. ఈ మేరకు పాకిస్థాన్ ను టెర్రరిజం ఫ్యాక్టరీగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఆపరేషన్ సిందూర్ విజయంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లో ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు పాల్గొనాలని కోరారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు అందరూ పాల్గొనాలని అన్నారు.
అంతేకాక సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రజలకు కీలక సూచనలు చేశారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యోగులు, మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలన్నారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని సూచనలు చేశారు. 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.












Click it and Unblock the Notifications