నన్ను మంత్రిగా చూడాలని విపక్షాలు కోరుకుంటున్నాయి: కల్వకుంట్ల కవిత
కరీంనగర్: తనను మంత్రిగా చూడాలని ప్రతిపక్షాల నాయకులు కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తన ప్రతిభను చూసి ప్రతిపక్షాల నేతలు అలా కోరుకుంటున్నారని అన్నారు.
మన ఊరు - మన ఎంపి పేరుతో గ్రామాల పర్యటన ముగింపు సందర్భంగా ఆమె గురువారం మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లోలని సారంగపూర్ మండలం తుంగూరు గ్రామంలో ఆమె గురువారం పర్యటించారు. తన వక్తృత్వ పటిమను చూసి తాను కేంద్ర మంత్రివర్గంలో చేరితో బాగుంటుందని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని ఆమె అన్నారు.

ప్రధాని మోడీ ప్రభుత్వంలో చేరే విషయంపై తమ పార్టీలో ఏ విధమైన చర్చ జరగలేదని ఆమె స్పష్టం చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీయె ప్రభుత్వానికి తమ పార్టీ దూరంగానే ఉంటోందని ఆమె అన్నారు. దేశానికి ప్రయోజనం చేకూరుతందని భావించినప్పుడు మాత్రమే ఎన్డియే విధానాలను తాము సమర్థించామని చెప్పారు.
తెలంగాణకు నిధులు మంజూరు చేయకపోవడం పట్ల, కొత్త పరిశ్రమలకు రాయితీలు ప్రకటించడం పట్ల ఆమె కేంద్ర ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని పన్నులను మినహాయిస్తే తెలంగాణలో పరిశ్రమల అభవృద్ధి మరింత జోరు అందుకుని ఉండేదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications