మరి వీటి మాటేమిటి: హరీష్‌పై ప్రశ్నల వర్షం, 'మన రాష్ట్రంలో' లాఠీఛార్జ్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: మల్లన్న సాగర్ ఉద్యమం ఉద్రిక్తత పైన విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఆదివారం నాడు రెండు గ్రామాలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, ప్రతిగా ప్రజలు వారిని రాళ్లతో కొట్టిన విషయం తెలిసిందే.

మల్లన్న సాగర్ కోసం ఆరు గ్రామాల ప్రజలు భూమి ఇచ్చేందుకు అంగీకరించారని, రెండు గ్రామాల ప్రజలను విపక్షాలు రెచ్చగొడుతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. దానికి మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.

మెదక్ జిల్లా బంద్ విఫలమైందని తెరాస నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు తమ నేతలను అరెస్ట్ ఎందుకు చేశారో చెప్పాలని భట్టి ప్రశ్నించారు. ముంపు గ్రామస్తులు భూమి స్వచ్చంధంగా ఇస్తున్నారని చెబుతున్నారని, అలాంటప్పుడు వారు ఆందోళన ఎందుకు చేశారు, వారి పైన పోలీసులు ఎందుకు లాఠీఛార్జ్ చేశారని నిలదీశారు. రైతుల పైన లాఠీఛార్జ్‌కు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

హరీష్ రావు

హరీష్ రావు

మెదక్ జిల్లా బంద్ విఫలమైందన్న మంత్రి హరీష్ రావు, తెరాస నేతలపై విపక్షాలు ప్రశ్నల వర్షం కురిపించాయి. బంద్ విఫలమైతే లాఠీచార్జ్ ఎందుకు, నేతల అరెస్ట్ ఎందుకో చెప్పాలన్నారు.

జగ్గా రెడ్డి

జగ్గా రెడ్డి

మన రాష్ట్రం, మన పాలన అంటూ పోలీసులతో ప్రజలను కొట్టిస్తారా? అంటూ హరీశ్ రావు పైన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు న్యాయం చేయకపోతే మంత్రి హరీశ్ రావును జిల్లాలో అడుగుపెట్టనివ్వమన్నారు. మల్లన్న సాగర్‌కు ఎనిమిది గ్రామాల రైతులు ఒప్పుకుంటే వారు ఆందోళనకు ఎందుకు దిగుతారని ప్రశ్నించారు. నిర్వాసితులకు న్యాయం జరిగే ఉద్యమం ఆగదని జగ్గారెడ్డి అన్నారు.

నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్ధన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరిట జరుగుతున్న అవినీతిని కోర్టులో బట్టబయలు చేస్తానని బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట అవినీతికి పాల్పడుతోందని, ఈ పార్టీ నిజస్వరూపాన్ని, దోపిడీని బయట పెడతానని హెచ్చరించారు.

నాగం జనార్ధన్ రెడ్డి

నాగం జనార్ధన్ రెడ్డి

గుత్తేదారుల జేబులు నింపేందుకు పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు డిజైన్‌‌ను మార్చారని ఆరోపించారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులనే విచక్షణ కూడా లేకుండా మల్లన్నసాగర్‌ నిర్వాసితులపై లాఠీచార్జ్ చేయించడం దారుణమన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Oppositions question Harish Rao over Mallanna Sagar issue.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి