హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ ప్రకటన: ఉస్మానియా ఆసుపత్రి తరలింపు మొదలు(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా ఆసుపత్రి నుంచి చికిత్సా విభాగాలను ఇతర హాస్పిటల్స్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.

కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో రోగులను వారంలో ఇతర ఆసుపత్రుల్లో సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఉస్మానియా పాత భవనంలోని ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతున్న 24 మంది రోగులను బుధవారం కింగ్‌కోఠీ జిల్లా దవాఖానకు తరలించారు.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి నుంచి చికిత్సా విభాగాలను ఇతర హాస్పిటల్స్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఉస్మానియా ఆసుపత్రిలో రోగులను వారంలో ఇతర ఆసుపత్రుల్లో సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి


ఈ మేరకు ఉస్మానియా పాత భవనంలోని ఆర్థోపెడిక్ విభాగంలో చికిత్స పొందుతున్న 24 మంది రోగులను బుధవారం కింగ్‌కోఠీ జిల్లా దవాఖానకు తరలించారు.

 ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

తరలింపబడిన వారిలో పన్నెండు మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు, నలుగురు చిన్నారులు ఉన్నారు.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

తరలింపు ప్రక్రియ ఉదయంనుంచి మొదలవుతుందని మొదట భావించినప్పటికీ వివిధ కారణాలతో మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమైంది.

 ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

అంబులెన్స్‌లలో వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ మధ్య సూపరింటెండెంట్ డాక్టర్ రఘురాం, ఆర్‌ఎంవోలు డాక్టర్ అంజయ్య, రఫీ, నజాఫీ బేగం, తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో రోగులను తరలించారు.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

వీరికి వైద్య సేవలు అందించేందుకు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు స్పెషలిస్ట్ ఆర్థో సర్జన్స్, ఆరుగురు జూనియర్ డాక్టర్లతోపాటు నర్సింగ్ సిబ్బందిని కేటాయించారు. ఆర్థోపెడిక్ డాక్టర్ ప్రొఫెసర్ వాసుదేవ రావు పర్యవేక్షణలో ఈ రోగులకు వైద్యం అందిస్తున్నారు.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగంలోని రోగులతోపాటు సర్జికల్, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలను కూడా త్వరలో తరలించనున్నట్లు సూపరింటెండెంట్ తెలిపారు.

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శిథిలావస్థకు చేరిన ఉస్మానియా పాత భవనంలోని రోగులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కింగ్ కోఠీ జిల్లా దవాఖాన, సుల్తాన్‌బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులకుతరలించనున్నట్లు తెలిపారు.

 ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

ఆర్థో విభాగంలోని రోగులను కింగ్‌కోఠీ ఆసుపత్రికి, సర్జికల్, మెడికల్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాల్లోని వారిని సుల్తాన్‌బజార్ ఆసుపత్రికి తరలిస్తున్నామన్నారు.

 ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

ఆయా ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరిచి వంతులవారీగా రోగులను పంపిస్తామన్నారు. ఓపీ, ఎమర్జెన్సీ విభాగంవంటి సేవలు ఉస్మానియా ఆసుపత్రిలోనే అందిస్తామన్నారు.

 ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆసుపత్రి

ఉస్మానియా ఆర్థోపెడిక్ విభాగంలో పనిచేస్తున్న వైద్యులను కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Osmania Hospital shifting: 24 patients shifted to King Kothi hospital
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X