ఉస్మానియా ఆస్పత్రిలో భయానక పరిస్థితులు, తరలిస్తాం: కెసిఆర్

హైదరాబాద్: హైదరాబాదు నగరంలోని ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని ఇక్కడి నుంచి వారంలోగా తరలిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రకటించారు. ఆయన గురువారంనాడు ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి ఆవరణను, భవనంలోని ప్రతీ విభాగాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

ఉస్మానియా ఆస్పత్రిలో భయానక పరిస్థితులను గమనించానని తెలిపారు. ఆస్పత్రి భవనం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్పత్రి భవనం చారిత్రక ప్రాధాన్యత కలిగినదే కావచ్చు గానీ అంతకన్నా రోగులు, వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ప్రాణాలు ముఖ్య మని కెసిఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారంలోగా ఆస్పత్రిని వేరే ప్రాంతానికి తరలిస్తామన్నారు. ఇందు కోసం జీహెచ్‌ఎంసీతో చర్చిస్తామన్నారు.

 Osmania hospital will be shifted: KCR

దోబి గదిని సందర్శిస్తే అక్కడ ప్రమాదకర వాతావరణం కనిపించిందన్నారు. ఆ గది ఎప్పుడు కూలుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. నర్సింగ్ కాలేజీ కూడా ఇదే స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఆస్పత్రికి రావడమే ఆలస్యమైనట్టు భావిస్తున్నానని తెలిపారు. ఎప్పుడో ఆస్పత్రికి రావాల్సిందని అన్నారు.

 Osmania hospital will be shifted: KCR

ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని చారిత్రక భవనాల జాబితా నుంచి తొలగించాలని కోరుతూ గవర్నర్‌ను, హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కలుస్తానని చెప్పారు. ఆస్పత్రి భవనం ఉన్న స్థలంలో నూతన భవనాన్ని నిర్మింపజేస్తామన్నారు. ఈ ఆస్పత్రికి తెలంగాణ పది జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి రోగులు వస్తున్నారని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత భవనం ఈ దుస్థితిలో ఉండటం బాధాకరమన్నారు.

 Osmania hospital will be shifted: KCR

చారిత్రక భవనమని చెప్పి, మనతో కానిదాన్ని అయితదని చెప్పి ప్రాణాల మీదకు తేవడం సరికాదన్నారు. ఆస్పత్రి వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సులు అందరు కలిసి చర్చించి ఆస్పత్రిని ఎక్కడకు తరలిస్తే బాగుంటుందో చర్చించుకుంటారని వివరించారు. మళ్లీ ఇదే స్థలతో కొత్త ఆస్పత్రి భవనాన్ని నిర్మిస్తామన్నారు.

 Osmania hospital will be shifted: KCR
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+