వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంత పాలనలో.. ఓయులో ఆత్మహత్యాయత్నం, కోదండ అరెస్ట్‌పై హెచ్చార్సీకి

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట బుధవారం నాడు ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ అనే యువకుడు ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ ఎదుట బుధవారం నాడు ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ అనే యువకుడు ఒంటి పైన కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ ఉద్యమం సమయంలో ఓయు అట్టుడికిన విషయం తెలిసిందే. తెలంగాణ సిద్ధించిన తర్వాత కూడా ఉద్యోగాలు వంటి పలు అంశాలపై అప్పుడప్పుడు ఉద్రిక్తత కనిపిస్తోంది.

కోదండరాం ముందస్తు అరెస్టు, విద్యార్థులు, కార్యకర్తలను కూడా: ర్యాలీపై ఉత్కంఠకోదండరాం ముందస్తు అరెస్టు, విద్యార్థులు, కార్యకర్తలను కూడా: ర్యాలీపై ఉత్కంఠ

మన తెలంగాణ వచ్చినా, మన పాలన అని అనుకున్నా.. అలా కనిపించడం లేదని కోదండ సహా పలువురు నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.

కోదండరాం అరెస్టుపై ఖండన

తెలంగాణ జేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం అరెస్టు అప్రజాస్వామికమని కాంగ్రెస్‌ నేత వీ హనుమంత రావు బుధవారం అన్నారు. నిరుద్యోగ ర్యాలీని అనుమతించకపోవడం సరికాదని చెప్పారు.

OU student tries to commit suicide

ఇంటికో ఉద్యోగం అన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోవడం గుర్తించాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు 27శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కోదండ అరెస్టుపై హెచ్చార్సీలో ఫిర్యాదు

కోదండరాం అరెస్టు పైన హైకోర్టు న్యాయవాది నవీనా రెడ్డి హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. కోదండరాం అరెస్టు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. వెంటనే ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేదాకా పోరాడుతామన్నారు.

'హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి''హెచ్చరిక.. మీ భవిష్యత్తును నాశనం చేసుకోకండి'

ఇదిలా ఉండగా, నిరుద్యోగ ర్యాలీని అడ్డుకోవడమే కాకుండా, అడుగడుగునా పోలీసులను ఉంచి ర్యాలీకి వస్తున్న వారిని అరెస్టు చేయడం, కోదండరాంను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ.. రేపు విద్యార్థి సంస్థల బందుకు ఓయు ఐకాస పిలుపునిచ్చింది.

English summary
Osmania Student on Wednesday tried to commit suicide at Arts College in Osmania University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X