రేవంత్‌కు బెయిల్ లభించడంపై నిరసన: ఓయూలో ఉద్రిక్తత, విద్యార్థికి మంటలు
హైదరాబాద్: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ ఓయూ విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు.
ఆందోళనలో భాగంగా ఆర్ట్స్ కళాశాల వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న విద్యార్థి శివన్నారాయణపై ప్రమాదవశాత్తూ పెట్రోల్ పడి... మంటలు చెలరేగాయి. ఉహించని పరిణామం ఒక్కసారి ఎదురుకావడంతో అక్కడే ఉన్న విద్యార్థులంతా ఆందోళనకు గురైయ్యారు.

అప్రమత్తమైన సహ విద్యార్థులు మంటలను వెంటనే ఆర్పివేశారు. గాయపడిన విద్యార్థిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఓయూ క్యాంపస్ పోలీసులు... ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా సిబ్బందిని మోహరించారు.
రేవంత్‌రెడ్డి విడుదలను అడ్డుకునేందుకు చర్లపల్లి జైలుకు చేపట్టిన ర్యాలీని ఓయూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది.












Click it and Unblock the Notifications