సిరియా వెళ్లడమే లక్ష్యం, నెట్‌లో ఐఎస్ గురించి తెలుసుకున్నాం: హైదరాబాదీ యువకులు
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా మారణహోమం సృష్టిస్తున్న ఐస్‌ఐఎస్‌లో చేరడమే కాకుండా సిరియాకు వెళ్లడమే తమ లక్ష్యమని ‘సిట్' ఆధీనంలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు అబ్దుల్లా బాసిత్, మాజ్‌హుస్సేన్‌లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. సిట్ అధికారులు బుధవారం వారిని సుదీర్ఘంగా విచారించినట్టు తెలిసింది.
ఇంజినీరింగ్ తొలి సంవత్సరంలోనే తాము అంతర్జాలం ద్వారా ఐఎస్‌ఐస్ గురించి తెలుసుకున్నామని, ఫేస్‌బుక్‌లో తమ భావాలను తమ స్నేహితులతో పంచుకున్నామని చెప్పినట్టు సమాచారం. జిహాద్‌లో సభ్యులైన వారు చేస్తున్న ప్రచారం, పోరాటాలు తమలో భావోద్వేగాలను పెంచాయని, అందుకే 16 నెలల క్రితం బంగ్లాదేశ్ మీదుగా సరిహద్దుదాటి వెళ్లేందుకు ప్రయత్నించామన్నారు.

హైదరాబాద్ పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాక ఆలోచనా ధోరణి మార్చుకున్నామని, చదువుపై ధ్యాస ఉంచామన్నారు. అంతర్జాలంలో ఐఎస్‌ఐస్ సభ్యుల పోరాటాలతో మళ్లీ ఉత్తేజం వచ్చిందని, తమతో పాటు మరికొందరితో వీటిని పంచుకున్నామని, తమ ఆలోచనలతో ఏకీభవించడంతో ఒమర్ ఫరూక్‌ను తమతో చేర్చుకున్నామని చెప్పినట్టు తెలిసింది.
వీరి నుంచి సేకరించిన సమాచారంతోపాటు ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో వీరితో చాట్ చేసిన వారి వివరాలను సిట్ అధికారులు తీసుకున్నారు. మరోవైపు అబ్దుల్లాబాసిత్ ట్యాబ్‌లో సమాచారాన్ని వేగంగా క్రోడీకరించి ఇవ్వాలంటూ ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులను అభ్యర్థించామని సీసీఎస్ పోలీస్ అధికారి వివరించారు.
ఐఎస్‌లో చేరేందుకు బయల్దేరిన హైదరాబాద్‌కు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులను నాగ్‌పూర్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications