మాజీ ప్రధాని పీవి నరసింహరావు కుమారుడు కన్నుమూత

భారత మాజీ ప్రధాని పీవి నరసింహరావు కుమారుడు పీవి రాజేశ్వరరావు(60) సోమవారం కన్నుమూశారు.

హైదరాబాద్: భారత మాజీ ప్రధాని పీవి నరసింహరావు కుమారుడు పీవి రాజేశ్వరరావు(60) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

PV

కాగా, తన ముగ్గురు కుమారుల్లో రెండో వాడైన పీవి రాజేశ్వరరావు వద్దే పీవి నరసింహరావు ఎక్కువ కాలం గడిపినట్టుగా చెబుతారు. పీవి నరసింహరావు రాజకీయాల నుంచి తప్పుకున్నాక.. తుది శ్వాస విడిచేవరకు హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లో ఉన్న పీవి రాజేశ్వరరావు ఇంట్లోనే గడిపారు.

రాజేశ్వరరావు పూర్తి స్థాయి రాజకీయాల్లో రానప్పటికీ పీసీసీలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఆయన ఎక్కువ వ్యాపార నిర్వహణల మీదే దృష్టి పెట్టినట్టు చెబుతారు. పీవీ రాజేశ్వరరావు మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+