వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ధాన్యం కొనుగోలు రగడ: రాహుల్ గాంధీ ట్వీట్.. ఆ పని చెయ్యాలన్న ఎమ్మెల్సీ కవిత ట్వీట్!!

|
Google Oneindia TeluguNews

దాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ బిజెపి సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి నిరసనలు తెలియ చేయాలని, ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు.

ధాన్యం కొనుగోలుపై రాహుల్ గాంధీ ట్వీట్

కేంద్రం మాత్రం నిబంధనలకు తగినట్టే రాష్ట్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయని, తెలంగాణ రాష్ట్రం అందుకు మినహాయింపు కాదని తేల్చి చెబుతోంది. ఇక దీనిపై కేంద్రం తీరును నిరసిస్తూ టిఆర్ఎస్ పార్టీ నేతల కుట్రలు అంటూ కేంద్రం ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ తరుణంలో సందట్లో సడేమియా అంటూ కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఈ అంశంపై స్పందించారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలుగులో మంగళవారం ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ తెలంగాణా ధాన్యం కొనుగోలు కోసం పోరాటం చేస్తుందని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో పండించిన చివరి గింజ కొనే వరకు కొనుగోలు చెయ్యాల్సిందే

తెలంగాణ రాష్ట్రంలో పండించిన చివరి గింజ కొనే వరకు కొనుగోలు చెయ్యాల్సిందే


తెలంగాణ రాష్ట్రంలో పండించిన చివరి గింజ కొనే వరకు, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బిజెపి, టిఆర్ఎస్ ప్రభుత్వాలు నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతన్నను క్షోభపెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఇదే క్రమంలో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగడుతూ నిరసనలకు పిలుపునిచ్చింది.

రాహుల్ గాంధీ ట్వీట్ పట్ల స్పందించిన ఎమ్మెల్సీ కవిత

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టిఆర్ఎస్ లు డ్రామాలు ఆడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ట్వీట్ పట్ల టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ గారు రాజకీయ లబ్ధి కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదన్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరొక నీతి ఉండకూడదని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రతిరోజు పార్లమెంటు వెల్ లోకి వెళ్లి నిరసన తెలియజేస్తున్నారు అని కవిత పేర్కొన్నారు.

 ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చెయ్యాలని రాహుల్ గాంధీకి సూచన

ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చెయ్యాలని రాహుల్ గాంధీకి సూచన

పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీపై ట్వీట్ చేశారు. ఒక దేశం ఒకే సేకరణ విధానం కోసం డిమాండ్ చేయండి అంటూ ఎంపీ కవిత తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇక ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ధాన్యం కొనుగోలు కోసం మాటల యుద్ధానికి దిగటంతో ఈ రైస్ వార్ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది తెలియాల్సి ఉంది.

English summary
Rahul Gandhi said the Congress struggle would continue till the last grain is procured in Telangana. MLC Kavita tweeted on Rahul Gandhi's tweet that a country should fight for a single collection policy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X