భోయిగూడ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి: పరిహారం ప్రకటన

హైదరాబాద్: నగరంలోని బోయిగూడలో జరిగిన భారీ అగ్నిప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు పరిహారం ఇస్తామని ప్రకటించారు.

'హైదరాబాద్‌‌లోని బోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. PMNRF నుంచి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున మరణించిన వారి బంధువులకు అందజేస్తాం' అని ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ వెల్లడించారు.

Pained by the loss of lives due to a tragic fire in Bhoiguda, Hyderabad: PM Modi

సికింద్రాబాద్‌ బోయిగూడలోని స్క్రాప్ దుకాణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది సజీవ దహనమయ్యారు. బుధవారం తెల్లవారుజాము 4 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌ జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. మిగిలిన 13 మంది మంటల్లో చిక్కుకున్నారు. వీరిలో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

సికింద్రాబాద్‌ బోయిగూడలో జరిగిన అగ్నిప్రమాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో బీహార్‌ కార్మికుల మృతిపై సంతాపం తెలిపారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌‌ను ఆదేశించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే దుకాణం యాజమానిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+