రేవంత్ రెడ్డికి చిప్పకూడే: పల్లా జోస్యం
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి చిప్పకూడు తప్పదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం టీఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రైతు పోరుబాట సభలో రేవంత్‌రెడ్డి భాష అభ్యంతరకరంగా ఉందని , కేటీఆర్ గాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోరని విమర్శించారు. కమిషన్ల కోసం పాలమూరు ఎత్తిపోతలకు రేవంత్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. పేదలకు మెరుగైన విద్యా, వైద్యం, అందిస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని చెప్పారు.












Click it and Unblock the Notifications