Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీ-పాన్‌షాప్ ఓనర్ కేసులో మరో ట్విస్ట్: 'నాకో బాయ్‌ప్రెండ్ ఉన్నాడని, అఫైర్ ఉందని అతనికి తెలుసు'

Recommended Video

    పాన్‌షాప్ యజమాని పై యువతీ ఫిర్యాదు

    హైదరాబాద్: పాన్‌షాప్ యజమాని ఉపేందర్, అతని టెక్కీ బాధితురాలి కేసులో మరో ట్విస్ట్. ఉపేందర్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన జీవితాన్ని నాశనం చేశాడని మహిళా సాఫ్టువేర్ ఇంజినీరి ఇటీవలే కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బుధవారం పోలీసు ఉన్నతాధికారులను కూడా కలిసింది.

    అయితే బాధితురాలు బ్లాక్ మెయిల్ చేస్తోందని, పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తోందని ఉపేందర్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ఈ మేరకు ఉపేందర్ భార్య ప్రీతి బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. ఉపేందర్ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

    ఆమెకు ఇదివరకే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. ఫోటోలు బయటకు

    ఆమెకు ఇదివరకే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు.. ఫోటోలు బయటకు

    సదరు యువతి కేవలం డబ్బుల కోసమే తన భర్తపై ఫిర్యాదు చేసిందని ఉపేందర్ భార్య ఆరోపిస్తోంది. ఆమెకు ఇదివరకే బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని కొన్ని ఫోటోలను బయట పెట్టింది. కొద్దికాలం అతడితో గడిపిన తర్వాత కట్టుకధ అల్లి తమ నుంచి డబ్బులు తీసుకోడానికి పథకం వేసిందని తెలిపింది. తమ నుంచి కోటి రూపాయలు డిమాండ్ చేసిందని బోయిన్‌పల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలు తమ ఇంటికి వచ్చి బెదిరింపులకు దిగిన సీసీ టీవీ ఫుటేజ్‌ని ఇప్పటికే పోలీసులకు అందించామని వివరించారు. తన ఇంటికి వచ్చి భర్తకు విడాకులు ఇవ్వాలని బెదిరించిందని చెప్పింది.

    నా బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్

    నా బాయ్‌ఫ్రెండ్‌తో సన్నిహితంగా ఉన్న ఫోటోలతో బ్లాక్‌మెయిల్

    ఇదిలా ఉండగా, ఉపేందర్ భార్య ఫిర్యాదుపై బాధితురాలు కూడా స్పందించింది. ఆమె హైదరాబాద్ కమిషనర్ అంజనీకుమార్‌ను ఆశ్రయించింది. ఉపేందర్‌తో పరిచయానికి ముందు తన క్లాస్‌మెట్‌తో తాను సన్నిహితంగా ఉన్న ఫోటోలను అడ్డం పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్న విషయం ఉపేంద్రకు ముందే తెలుసునని చెప్పింది. తనను ప్రేమించిన తర్వాత అతనిని పిలిచి సెటిల్మెంట్ చేశాడని తెలిపింది.

     నా కాలేజీ అఫైర్ గురించి అతనికి తెలుసు

    నా కాలేజీ అఫైర్ గురించి అతనికి తెలుసు

    ఉపేంద్ర సోదరుడు కూడా మీడియాకు విడుదల చేసిన తన ఫోటోలను తానే గతంలో ఉపేంద్రకు చూపించానని, తన గురించిన అన్ని విషయాలూ అతనికి తెలుసునని బాధితురాలు చెప్పింది. ఉపేంద్ర తనను దారుణంగా మోసం చేశాడని, ఇప్పుడు తానేమీ అతనితో ఉండాలని కోరుకోవడం లేదని చెప్పింది. చేసిన తప్పును అతను బహిరంగంగా అంగీకరించాల్సిందేనని పేర్కొంది. తన సోదరుడితో ఉన్న ఫొటోను సైతం అసభ్యంగా చూపిస్తున్నారని వాపోయింది. ఈ జనరేషన్‌లో ఒకరిద్దరు అబ్బాయిలతో రిలేషన్ చాలా కామన్ అని, తనకూ ఉన్నాయని చెప్పింది. కాలేజీ రోజుల్లో తనకున్న అఫైర్ గురించి నాలుగున్నర సంవత్సరాల క్రితమే ఉపేంద్రకు తెలుసునని వెల్లడించింది.

    భార్య ప్రీతికి విడాకులిస్తానని చెప్పాడు

    భార్య ప్రీతికి విడాకులిస్తానని చెప్పాడు

    పాన్‌లో మత్తుమందు కలిపి ఉపేందర్‌ తనను లొంగదీసుకున్నాడని, తనకు పెళ్లి కాలేదంటూ మాయమాటలు చెప్పి గత ఏడాది సెప్టెంబరు 2వ తేదీన రహస్యంగా తనను పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత అతనికి అప్పటికే పెళ్లయిన విషయం తనకు తెలిసిందని, ఈ విషయమై అడగగా.. తన భార్య ప్రీతికి విడాకులు ఇస్తానంటూ నమ్మించాడని చెప్పింది. రూ.40 లక్షలు తీసుకున్నానంటే బయటపెట్టాలన్నారు. తాను బాధితురాలైనందున పోలీసులు స్పందించడంతో ఉపేందర్ కుటుంబ సభ్యులు తనను చంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించింది. తనను వ్యక్తిగతంగా అవమానించేందుకు సోషల్ మీడియాలో నా ఫోటోలు పెడుతున్నారని చెప్పింది.

    ఉపేందర్ కుటుంబ సభ్యులతో ప్రాణహానీ

    ఉపేందర్ కుటుంబ సభ్యులతో ప్రాణహానీ

    కాగా, ఉపేందర్ కుటుంబ సభ్యులతో తనకు ప్రాణహాని ఉందని బాధితురాలు కమిషనర్ అంజనీ కుమార్‌కు బుధవారం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదును పరిశీలించిన అంజనీకుమార్... అదనపు సీపీ(నేర పరిశోధన) షికా గోయల్‌ దగ్గరకు వెళ్లాలని బాధితురాలికి సూచించారు. అంజనీకుమార్‌ సలహాతో ధితురాలు అదనపు సీపీ షికా గోయల్‌ను కలిసి ఫిర్యాదు చేసి, విలేకరులతో మాట్లాడింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+