ఆడపిల్ల పుట్టిందని..! అమ్మే వద్దంటోంది..!
నాగర్ కర్నూల్ : ఆడపిల్ల పుట్టిందని ఆ దంపతులు తీసుకున్న నిర్ణయం పేగుబంధానికి అర్థం లేకుండా చేసింది. రోజులు కూడా నిండని ఆ బిడ్డ తమకొద్దంటూ ఐసీడీఎస్ అధికారులను ఆశ్రయించారు. దీంతో చేసేదేమీ లేక ఆ పసిబిడ్డను శిశు సంరక్షణ గృహానికి చేర్చారు. మనసులను కదిలిస్తున్న ఈ ఘటన నాగార్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలో చోటుచేసుకుంది.
బాణాల గ్రామానికి చెందిన రమావత్ నిరంజన్ - దస్లి దంపతులకు నలుగురు ఆడపిల్లలు జన్మించారు. అందులో ఓ కూతురు అనారోగ్యం కారణంగా చనిపోయింది. అయితే వారసత్వం నిలిపేందుకు మగ సంతానం కావాలనుకున్నారు ఆ దంపతులు. ఆ క్రమంలో దస్లి మరోసారి గర్భం దాల్చడంతో శనివారం నాడు అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్ చేశారు కుటుంబ సభ్యులు. ఐదో కాన్పులోనూ ఆడపిల్ల జన్మించడం.. ఆ దంపతులకు నచ్చలేదు. దీంతో పసిబిడ్డ తమకు భారంగా మారుతుందని భావించి వదిలించుకోవాలని డిసైడయ్యారు.

ఆమేరకు అంగన్‌వాడీ టీచర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆమె వచ్చి దస్లి - నిరంజన్ కు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో.. పై అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో సూపర్‌వైజర్ విజయలక్ష్మి, ఇతర సిబ్బంది హాస్పిటల్ కు వచ్చి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా ఆ దంపతుల నిర్ణయంలో మార్పు రాలేదు. చివరకు ఆ పసిగుడ్డును మహబూబ్‌నగర్‌లోని శిశు సంరక్షణ గృహానికి తరలించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications