వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందకృష్ణకు చెక్!: మోడీ వద్దకు తీసుకెళ్తున్న కేసీఆర్, వైసిపికి లేని పిలుపు

ఎస్సీ వర్గీకరణ కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో అఖిల పక్షం ఎల్లుండి (ఫిబ్రవరి 6వ తేదీ) ఢిల్లీకి వెళ్లనుంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోరుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో అఖిల పక్షం ఎల్లుండి (ఫిబ్రవరి 6వ తేదీ) ఢిల్లీకి వెళ్లనుంది. ఈ మేరకు అన్ని పార్టీలకు ప్రభుత్వం నుంచి లేఖలు వెళ్లాయి.

తెలుగుదేశం, బీజేపీ, మజ్లిస్, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం పార్టీలకు లేఖలు పంపించారు. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆహ్వానం అందలేదు.

<strong>రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై.. నిన్న పవన్ కళ్యాణ్, నేడు చిరంజీవి కూతురు</strong>రామ్ గోపాల్ వర్మ ట్వీట్లపై.. నిన్న పవన్ కళ్యాణ్, నేడు చిరంజీవి కూతురు

ఈ క్రమంలో జనవరి 5న ఢిల్లీకి రావాలని ప్రధాన రాజకీయ పార్టీలకు సీఎం లేఖలు రాయడం గమనార్హం. ఎస్సీ వర్గీకరణపై ఇప్పటికే అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని అఖిలపక్షం కేంద్రాన్ని కోరనుంది.

 All party will meet PM Modi on SC catagerisation

మందకృష్ణకు చెక్!

ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని కేసీఆర్ ఢిల్లీకి తీసుకు వెళ్లాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు అఖిలపక్షాన్ని తీసుకెళ్లడం ద్వారా తమ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెప్పడం మందకృష్ణకు ఓ విధంగా చెక్ చెప్పడమే. ఆ తర్వాత భారం కేంద్రానిదే అవుతుంది.

మరోవైపు, ఎస్సీ వర్గీకరణకు కేసీఆర్ సానుకూలంగా ఉన్నారు. అదే ఏపీ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా లేదు. అందుకు కారణం ఉంది. తెలంగాణలో మాదిగలు ఎక్కువ. మాలలు చాలా తక్కువ. ఏపీలో మాత్రం మాలలు మెజార్టీ కాగా మాదిగలు చాలా తక్కువ. ఈ నేపథ్యంలోనే ఏపీలో ఇబ్బందులు కొని తెచ్చుకోకుండా ఉండేందుకు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణకు దూరంగా ఉంటున్నారు.

English summary
All party from Telangana State will meet Prime Minister Narendra Modi on SC categorisation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X