గవర్నర్ నరసింహన్ ఉన్నవిమానంలో లగేజ్ కలకలం

హైదరాబాద్: హైదరాబాద్ ‌- న్యూఢిల్లీ విమానంలో కలకలం రేగింది. చెక్‌ ఇన్‌ అయిన తర్వాత ఓ ప్రయాణికుడు విమానం ఎక్కకుండా లగేజీని విమానంలో ఎక్కించి వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత ఈ విషయం గ్రౌండ్‌ కంట్రోల్‌ నుంచి విమాన సిబ్బందికి చేరింది.

 Passenger leaves luggage in Hyderabad to Delhi flight

దీంతో విమానం తిరిగి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరింది. అయితే, అప్పటికీ విమానం ఇంకా బయలుదేరలేదని కూడా తెలుస్తోంది. చెక్‌ ఇన్‌ అయిన తర్వాత ప్రయాణికుడు ఎందుకు ఎక్కలేదనే దానిపై విమానాశ్రయ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. లగేజీలో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు.

సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఈ విమానం వెనక్కి రప్పించడానికి కారణమైందని ఆరోపిస్తున్నారు. కాగా, అదే విమానంలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రయాణిస్తుండడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. ఇదిలా ఉండగా, గవర్నర్ నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నరసింహన్ ఢిల్లీ చేరుకున్నారు.

విమానాశ్రయంలో బంగారం పట్టివేత

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో 400 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. సింగపూర్‌ నుంచి వచ్చిన తమిళనాడు వాసి ఫణిసెల్వ నుంచి అధికారులు ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+