Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మూసీలో మంచినీళ్లు: నిర్వాసితుల తరలింపుపై తేల్చేసిన దాన కిశోర్

మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దాన కిశోర్ తెలిపారు. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చట్టానికి లోబడి హైడ్రా, అధికారులు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మూసీ నిర్వాసితుల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.

మూసీ నిర్వాసితులను ఎవరినీ బలవంతంగా తరలించడం లేదని దాన కిశోర్ తెలిపారు. మూసీ నిర్వాసితులతో సామరస్యంగా మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లకు తరలిస్తున్నామన్నారు. నిర్వాసితుల్లో 90 శాతం మంది ఖాళీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారన్నారు. మూసీ నిర్వాసితుల్లో ఎవరికైనా పట్టాలు ఉంటే రెట్టింపు ధర ఇస్తున్నట్లు దాన కిశోర్ తెలిపారు.

Past Glory to Musi Dana Kishore on evacuation of displaced persons

హైదరాబాద్‌లో 1927లో మూసీకి వచ్చిన వరదలతో భారీ నష్టం జరిగిందని దాన కిశోర్ గుర్తు చేశారు. గతంలోనూ నిర్వాసితులను తరలించారన్నారు. హైదరాబాద్‌లో ఇటీవల దాదాపు 9 సెం.మీపైగా వర్షాలు కురిశాయని.. చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపునకు గురవుతుందన్నారు. గతంలో మూసీ సుందరీకరణకు ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పలు సూచనలు చేశారని తెలిపారు. హైదరాబాద్ లో ప్రస్తుతం కోటి జనాభా ఉందన్నారు. మూసీ పరివాహక ప్రాంతం మురికికూపంలా మారిందని, దాన్ని మార్చాల్సిందేనని స్పష్టం చేశారు.

మూసీకి వరదలు వస్తే ఇబ్బందులు పడేది ప్రజలేనని దాన కిశోర్ అన్నారు. మూసీ పరిధిలోని ఎమ్మెల్యేలను తీసుకుని క్షేత్ర పర్యటనకు వెళ్తామని చెప్పారు. మూసీ బఫర్‌జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఇళ్లను ఎప్పటికైనా తొలగించాల్సిందేనని దాన కిశోర్ తేల్చి చెప్పారు. మూసీ నిర్వాసితులకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల విలువైన ఇళ్లను ఇస్తున్నట్లు దాన కిశోర్ వివరించారు.

2030 నాటికి హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థ 250 బిలియన్ డాలర్లకు చేరుతుందని దాన కిశోర్ తెలిపారు. మూసీలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2026 జూన్ లోపు మూసీ నదిలో మంచినీరు ప్రవహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని ఆయన తెలిపారు. మూసీ నదిలోకి వచ్చే నీటిని శుద్ధి చేసేందుకు రూ. 3800 కోట్ల వ్యయం చేస్తున్నట్లు చెప్పారు.

మూసీ రివర్ ఫ్రంట్ పక్కనే పార్కులు, పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తామన్నారు. 55 కి.మీ పొడవైన ఈస్ట్, వెస్ట్ కారిడార్లు నిర్మిస్తున్నామని, దీంతో నగరంలో ట్రాఫిక్ తగ్గుతుందని దాన కిశోర్ తెలిపారు. మూడు నెలల క్రితం మూసీ రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ అధికారులు 55 కి.మీ మేర డ్రోన్ సర్వే చేసి దాదాపు 10,600 ఇళ్లు, నిర్మాణాలు.. బఫర్ జోన్, రివర్ బెడ్ లో ఉన్నాయని గుర్తించినట్లు తెలిపారు. వారంతా ఏదో ఒకరోజు ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.

నిర్వాసితుల కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని దాన కిశోర్ తెలిపారు. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించడంతోపాటు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మూసీ ఆధునీకరణ వల్ల వ్యాపారాలు పెరుగుతాయని, మూసీ ఆధునీకరణకు ప్రజలందరూ సహకరించాలి దాన కిషోర్ విజ్ఞప్తి చేశారు. మూసీ నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకుంటామని మరోసారి స్పష్టం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+